Tollywood : మేకప్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చిన ముద్దుగుమ్మ.. ఇంతకీ ఆ హీరోయిన్ను గుర్తుపట్టారా ?..
సడెన్ గా ఓ బ్యూటీ మేకప్ లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇటీవల నెట్టింట వరుసగా హాట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా లేకపోయినా.. నిత్యం గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. పైన ఫోటోలో కనిపిస్తోన్న బ్యూటీని గుర్తుపట్టారా ?.. తనే

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. మరోవైపు పలువుర్ స్టార్స్ అభిమానులతో లైవ్ చిట్ చాట్స్ చేస్తూ సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. ఇక కొందరు అందాల తారలు మాత్రం ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సడెన్ గా ఓ బ్యూటీ మేకప్ లేకుండానే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇటీవల నెట్టింట వరుసగా హాట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా లేకపోయినా.. నిత్యం గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. పైన ఫోటోలో కనిపిస్తోన్న బ్యూటీని గుర్తుపట్టారా ?.. తనే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్. ఇటీవల ఈ అమ్మడు నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడు అందమైన పిక్స్ షేర్ చేసే నభా.. తాజాగా మేకప్ లేకుండా పిక్స్ షేర్ చేసింది.
ఇంకేముంది ఆ ఫోటోస్ చూసి చాలా మంది షాకవుతున్నారు. అందులో కనిపిస్తోంది నభా నటేష్ ఆ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మేకప్ లేకుండా చాలా మంది హీరోయిన్స్ ను చూడలేదు. ఇక తారలు కూడా కనీసం మేకప్ లేకుండా బయటకు వచ్చే ఆసక్తి కూడా చూపించరు. కానీ నభా మాత్రం మేకప్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చి మరోసారి నెట్టింట వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతుండగా.. నభాను అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
View this post on Instagram
1995 డిసెంబర్ 11న శ్రీంగేరిలో జన్మించింది నభా నటేష్. మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన నభా.. 2015లో వజ్రకాయ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో శివ రాజ్ కుమార్ నటించారు. ఆ తర్వాత లీ, సాహెబా చిత్రాల్లో నటించింది. నన్ను దొచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత నభాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.