AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రకృతి కొండల నడుమ కేరళ కుట్టి.. అపజయమెరుగని అందాల తార ఎవరో గుర్తుపట్టండి..

అందం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకున్న ఈ చిన్నది.. నటనపరంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ బ్యూటీ నటించిన సినిమాలు డిజాస్టర్ కాలేదు. అన్ని సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారంతా. కానీ.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.

Tollywood: ప్రకృతి కొండల నడుమ కేరళ కుట్టి.. అపజయమెరుగని అందాల తార ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 08, 2023 | 9:09 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కేరళ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ఈ అమ్మడు.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. అందం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకున్న ఈ చిన్నది.. నటనపరంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఈ బ్యూటీ నటించిన సినిమాలు డిజాస్టర్ కాలేదు. అన్ని సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారంతా. కానీ.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. ఎవరో గుర్తుపట్టగలరా ?. తనే హీరోయిన్ సంయుక్త మీనన్. ఇప్పుడు గుర్తుపట్టండి.

1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో జన్మించిన సంయుక్త..త్రిసూర్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. గ్రాడ్యూయేషన్ పూర్తికాగానే.. 2016లో పాప్ కార్న్ అనే మలయాళం సినిమాతో కథానాయికగా అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో కలరి సినిమాతో తమిళ్ సినీరంగానికి పరిచయమైంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఇందులో సంయుక్తది చిన్న పాత్ర అయినా.. గుర్తింపు వచ్చింది.ఈ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. బింబిసార తర్వాత సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మరిన్ని హిట్స్ అందుకుంది. ముఖ్యంగా విరూపాక్ష సినిమాలో ఆమె నటనపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన డేవిల్ చిత్రంలో నటిస్తోంది. వీరిద్దరి జోడి మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ సినిమా కాకుండా సంయుక్త మరోప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది. అలాగే సార్ సినిమా తమిళంలో వాతి పేరుతో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాతోనే తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా పెట్టింది సంయుక్త. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ఉంది. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమాలో సంయుక్తను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియరాలేదు.

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో