Satya Teaser: సాయి ధరమ్ తేజ్.. కలర్ స్వాతి ఫీచర్ ఫిలిం ‘ది సోల్ ఆఫ్ సత్య’ ప్రోమో.. ఆకట్టుకుంటున్న వీడియో..
విరూపాక్ష సినిమాతో భయపెట్టిన సాయి తేజ్.. తాజాగా బ్రో సినిమాతో అలరించారు. ఈ చిత్రంలో మొదటి సారి తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఇది రెండన్నర గంటల సినిమా మాత్రం కాదు. కేవలం 23 నిమిషాలు ఉండే చిన్న సినిమా.

ఇటీవలే విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా.. రాజీవ్ కనకాల, సునీల్ కీలకపాత్రలు పోషించారు. విరూపాక్ష సినిమాతో భయపెట్టిన సాయి తేజ్.. తాజాగా బ్రో సినిమాతో అలరించారు. ఈ చిత్రంలో మొదటి సారి తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు తేజ్. కానీ ఇది రెండన్నర గంటల సినిమా మాత్రం కాదు. కేవలం 23 నిమిషాలు ఉండే చిన్న సినిమా.
దేశభక్తి, దేశం కోసం ఫైట్ చేసే సైనికుల గురించి సాయి తేజ్ గతంలో ఓ షార్ట్ ఫీచర్ ఫిలిం చేశారు. ఈ సినిమాను తన స్నేహితులతో కలిసి తెరకెక్కించారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ సైనికుడిగా కనిపించబోతున్నారు. ఇక అతని భార్యగా.. కాలేజీ స్నేహితురాలిగా కలర్ స్వాతి నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగస్ట్ 15న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి చిన్న ప్రోమో రిలీజ్ చేశారు.




తాజాగా విడుదలైన ది సోల్ ఆఫ్ సత్య చిన్న ప్రోమో ఆకట్టుకుంటుంది. సాయి తేజ్, కలర్ స్వాతి ఇద్దరి జంట చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సాయి తేజ్ మిత్రుడు నవీన్ దర్శకత్వం వహించారు. 23 నిమిషాలు ఉండే ఈ సినిమాలో 6 నిమిషాల సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్ శ్రుతి రంజని ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ షార్ట్ ఫీచర్ ఫిలిం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. మరీ ది సోల్ ఆఫ్ సత్య చిన్న ప్రోమోను మీరు చూసేయ్యండి.
View this post on Instagram




