Tollywood: ఈ ఫొటోలోని అక్కా చెల్లెళ్లను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా ఫేమస్.. వివాదాల్లోనూ..
సినిమా తారలు అప్పుడప్పుడు తమ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో బాగా ఫేమస్ సెలబ్రిటీ ఒకరు ఇప్పుడు తమ త్రో బ్యాక్ ఫొటోస్ ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. చిన్నప్పుడు తన సోదరితో కలిసున్న క్యూట్ ఫొటోలను పంచుకుంది.

పై ఫొటోలో క్యూట్ గా ఉన్న సిస్టర్స్ ను గుర్తు పట్టారా? ఇప్పుడీ అక్కాచెల్లెళ్లు టాలీవుడ్ లో బాగా ఫేమస్. ముఖ్యంగా ఇందులో ఒకరు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆమె సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటాలని హైదరాబాద్ కు వచ్చింది. మొదట కొన్ని న్యూస్ ఛానెల్స్ లో పని చేసింది. తన వాయిస్ తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ తో సంగీతాభిమానుల మనసులు గెల్చుకుంది. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న సింగర్లలో ఈమె కూడా ఒకరు. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈమెతో పాటు ఈమె చెల్లి కూడా సింగర్ గా అదరగొడుతోంది. ముఖ్యంగా ఒకే ఒక్క పాటతో ఆమె బాగా పాన్ ఇండియా ఫేమస్ అయ్యింది. మరీ ఈ అక్కాచెల్లెళ్లు ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ సింగర్ ఈ మధ్యన తన సాంగ్స్ తో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా ఈ సింగర్ ఆలపించిన ఒక సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అదే సమయంలో వివాదాల్లోనూ ఇరుక్కుంది. ఈ పాటికే అర్థమైంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఇందులో ఉన్నది ఫోక్ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్.
పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాటతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్. సోషల్ మీడయాలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా కొన్ని త్రో బ్యాక్ ఫొటోలను షేర్ చేసుకుంది. చిన్నప్పుడు అక్క మంగ్లీతో ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి .వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ వావ్ బ్యూటీఫుల్.. సో క్యూట్’ అంటూ ఈ సింగర్స్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
సింగర్ మంగ్లీతో ఇంద్రావతి చౌహాన్..
View this post on Instagram
కాగా ఈ మధ్యన మంగ్లీ పాడిన ‘బాయిలోన బల్లిపలికే’ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫోక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. అదే సమయంలో ఈ సాంగ్ వివాదాల్లోనూ ఇరుక్కుంది. కొందరు ఈ పాటపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








