కట్టెపుల్లలా ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? టాలీవుడ్‌ సింగింగ్‌ సెన్సేషన్‌.. ఈ గొంతుకు ప్రపంచమే ఫిదా అయ్యింది

|

Jun 10, 2023 | 6:15 AM

ఈ ఫొటోలో అమాయకంగా, బక్కపల్చగా ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్‌ లేటెస్ట్‌ సింగింగ్‌ సెన్సేషన్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈపేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పుడు గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ పాటలు ఆలపించిన అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు.

కట్టెపుల్లలా ఉన్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? టాలీవుడ్‌ సింగింగ్‌ సెన్సేషన్‌.. ఈ గొంతుకు ప్రపంచమే ఫిదా అయ్యింది
Tollywood Singer
Follow us on

ఈ ఫొటోలో అమాయకంగా, బక్కపల్చగా ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్‌ లేటెస్ట్‌ సింగింగ్‌ సెన్సేషన్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈపేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పుడు గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ పాటలు ఆలపించిన అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. ఒక గల్లీ సింగర్‌గా యూట్యూబ్ వీడియోస్‌ నుంచి మొదలైన అతని ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్‌ వేదిక వరకు చేరుకుంది. తన సింగింగ్‌ ట్యాలెంట్‌ తో హైదరాబాద్ బస్తీ నుంచి ఆస్కార్ స్టేజ్ వరకు చేరుకున్నాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్‌.. అతను మరెవరో కాదు నాటు నాటు సాంగ్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న మన ధూల్‌ పేట సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న రాహుల్‌ అరుదైన ఫొటోల్లో ఇది కూడా ఒకటి. 2004లో తీసుకున్న ఈ ఫొటోను ఒక సందర్భంలో అతనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘అసలు నమ్మలేకపోతున్నా. కట్టెపుల్లలాగా ఉన్నా అప్పుడు. ఏక దమ్‌ మంకీ’ అని తనపై తానే సెటై ర్లు వేసుకున్నాడు.

2009లో నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాతోనే రాహుల్ సిప్లిగంజ్ సినిమా జర్నీ కూడా మొదలైంది. అందులో కాలేజ్ బుల్లోడా అనే పాటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతర్వాత దమ్ములో ‘వాస్తు బాగుందే, ‘ఈగ’లో టైటిల్‌ సాంగ్, ‘రచ్చ’ లో సింగరేణి ఉంది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లో బోనాలు ఇలా పలు సినిమాల్లో రాహుల్‌ ఆలపించిన పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌తో ఏకంగా ఆస్కార్‌ వేదిక దాకా చేరుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై తెలుగోడి సత్తా ఇదంటూ అందరూ తలెత్తుకునేలా చేశాడు.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..