అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ.. ఆడవేషంలో ఉన్న నటుడు ఎవరో గుర్తుపట్టారా..
ఒకానొక సమయంలో నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులే ధరించేవారు. కాలక్రమంలో స్త్రీలు కూడా రంగ స్థలంపై అడుగు పెట్టి తమ నటనాప్రతిభను చాటుకున్నారు. అయితే ఇప్పటికీ చాలా సినిమాల్లో హీరోలు స్త్రీలుగా వేషం వేసుకుని నటించిన నటిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలనాటి మేటి నటులు, ఎన్టిఆర్, ఎన్నార్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి,రాజేంద్ర ప్రసాద్, హరీష్ వంటి ఎందరో వెండి తెరపై ఆడవారిగా వేషం వేశారు. అందంలో మేము హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోము అనే విధంగా కనిపించి అభిమానులను అలరించారు. అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన ఫోటోలో ఉన్న స్త్రీగా నటించింది ఒకనాటి మేటి నటుడు.. ఎవరో గుర్తు పట్టారా..!

వెండి తెరపై పురుషులు స్త్రీల వలెనే కనిపించి అలరిస్తే.. స్త్రీలు.. మగవారిలా మారి తమ నటనతో మెప్పించిన నటీనటులు ఎందరో ఉన్నారు. కథకు, పాత్రకు అనుగుణంగా స్త్రీ పాత్రలో నటించి మెప్పించిన హీరోలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఆడవేషంలో అందంగా కనిపిస్తున్న ఒక నటుడికి సంబంధించిన ఫోటో సినీ అభిమానులకు ఓ సవాల్ విసురుతోంది. ఈ నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ.. మీరు కనిపెట్టగలరేమో ట్రై చేయండి..
ఈ చిత్రంలో ఆడవేషంలో ఉన్న నటుడు నందమూరి అందగాడు అన్న నటరత్న ఎన్టీఆర్. జానపద, పౌరాణిక, సాంఘిక సినిమాల్లో అనేక పాత్రలు పోషించి రానా రాజసంతో మెప్పించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు రంగాస్తలంపైనే కాదు వెండి తెరపై కూడా అనేక సినిమాల్లో స్త్రీ పాత్రలను పోషించి మెప్పించారు. సీనియర్ ఎన్టిఆర్ చదువుకునే రోజుల్లోనే నటన మీద మక్కువతో నాటకాల్లో నటించేవారు. అలా నాయకురాలు నాగమ్మ పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు. మన దేశం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన ఎన్టిఆర్ అన్నాతమ్ముడు అనే సినిమాలో స్త్రీ వేషం ధరించారు.
పోలీసుల బారినుంచి తప్పించుకోవడానికి అందమైన స్త్రీగా మారి రేలంగితో ఆడిపాడారు. ఈ సిన్నివేశంలో రేలంగి, అన్న ఎన్టిఆర్ నటన భలే ఫన్నీగా ఉండి చూపరులను నవ్విస్తుంది. తరవాత ఎన్టిఆర్ కార్తవరాయని కథ సినిమాలో కూడా ఆడవేషం వేశారు.
కాగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవాంతకుడు సినిమాలోనిది. ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి యన్టీఆర్ ఆడవేషం ధరించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు పిడుగురాముడు, డ్రైవర్ రాముడు సినిమాలో కూడా యన్టీఆర్ చీర కట్టి ఆడవేషంలో కనిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
