Chiranjeevi, Balakrishna: ఇద్దరు లెజెండ్స్‌తో ఒకే ఫ్రేమ్‌లో! చిరు,బాలయ్యలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా?
చిరంజీవి, బాలకృష్ణ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు. సినిమాలు హిట్ అయినా, కాకపోయినా వీరి ఫాలోయింగ్ లో ఏ మాత్రం తేడా ఉండదు. రోజురోజుకు వీరి క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు. వయసు 50 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారీ లెజెండరీ యాక్టర్స్

చిరంజీవి, బాలకృష్ణ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు. సినిమాలు హిట్ అయినా, కాకపోయినా వీరి ఫాలోయింగ్ లో ఏ మాత్రం తేడా ఉండదు. రోజురోజుకు వీరి క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు. వయసు 50 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారీ లెజెండరీ యాక్టర్స్. అలాంటిది వీరిద్దరిలో ఏ ఒక్కరితో ఫొటో దిగినా ఎంతో అదృష్టమనుకుంటారు. అలాంటిది ఏకంగా ఇద్దరు లెజెండరీ నటులతో ఫొటో దిగాడు ఈ బుడ్డోడు. చిరంజీవి, బాలయ్యలను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. మరి ఈ పిల్లాడు ఎవరో ఈ పాటికే చాలా మంది గుర్తు పట్టే ఉంటారు. యస్. ఈ అబ్బాయి మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ. నందమూరి అభిమానులు మోక్షు సినిమా ఎంట్రీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ ఆశ మాత్రం నెరవేరడం లేదు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బాలకృష్ణ తన కుమారుడి సినిమా ఎంట్రీ గురించి నందమూరి ఫ్యాన్స్ కు హుషారెత్తే విషయం చెప్పారు. తన కుమారుడి మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని గతంలోనే చెప్పిన బాలయ్య బాబు.. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు.
‘మా అబ్బాయి మోక్షు కూడా సినిమా పరిశ్రమలోకి రాబోతున్నాడు. అయితే సినిమాల పరంగా తనను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోవద్దని మోక్షుకు చెప్పాను. సిద్దు జొన్నల గడ్డ, అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలను ఇన్ స్పైరింగ్‌గా తీసుకోమని చెబుతుంటాను’ అని ఓపెన్ గా చెప్పేశారు బాలయ్య. ఈ మాటలు విన్న నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు సినిమా కోసం మోక్షజ్ఞ ఫిట్ గా తయారవుతున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శీను లేదా, భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావి పూడితో మోక్షు లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
బాలయ్య, శ్రీలీలతో మోక్షజ్ఞ
E logic prakaram aa baana potta Mokshagna ni evaru dekharu ani Sreeleela fans kosam try chesthunnada bali.. https://t.co/GfVpax5F3j pic.twitter.com/1AWIZlIEVb
— Mass Kurrodu (@MassPrekshakudu) March 26, 2024
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య..
#NBK Talks about #Mokshagna Entry ! pic.twitter.com/xCcpK2VHIZ
— Rajesh Manne (@rajeshmanne1) May 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




