Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆ పెద్దింటి కోడలు కూడా
తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో బిజీగా ఉండగానే ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ పెద్దింటికి కోడలిగా వెళ్లిపోయింది.

పైన ఫొటోలో అమ్మ పక్కన నిల్చుని అమాయకంగా పోజిచ్చిన టీనేజ్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో హీరోయిన్ గా చేసింది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ తోనూ మెప్పించింది. అన్ని భాషల్లో కలిపి సుమారు 55 కు పైగా సినిమాలు చేసిన ఈ అందాల తారకు క్లాసికల్ డ్యాన్స్ లోనూ మంచి ప్రావీణ్యముంది. కాగా సినిమాల్లో ఉండగానే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందీ అందాల తార. అతనిని పెళ్లి చేసుకుని ఓ పెద్దింటికి కోడలిగా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమె సినిమాలు చేయట్లేదు కానీ.. అప్పడప్పుడు సహాయక నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తోంది. అయితే ఈ నటి భర్త, ఇద్దరు కుమారులు ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. ముగ్గురూ తమ యాక్టింగ్ తో సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ఇన్ని హింట్స్ ఇచ్చాక ఆమె ఎవరో ఈ పాటికే చాలా మంది గుర్తు పట్టేసి ఉంటారు. యస్. అందులో ఉన్నది మరెవరో కాదు అక్కినేని అమల. చిన్న వయసులో తల్లితో పాటు దిగిన ఫొటో అది.
గతంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసిన అమల పెళ్లి, పిల్లల తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అనంతరం అక్కినేని హీరోల ఫ్యామిలీ చిత్రం మనం లోనూ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇక శర్వానంద్ హీరోగా 2022లో విడుదలైన ఒకే ఒక జీవితం చిత్రంలో హీరో తల్లి పాత్రలో అమల అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సామాజిక సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది అమల. యానిమల్ లవరైన ఆమె హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ మెంబర్ గా ఉంటోంది.
అక్కినేని అమల లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
భర్త, హీరో నాగార్జునతో అక్కినేని అమల..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








