Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ మల్టీ ట్యాలెంటెడ్. చిన్నప్పటి నుంచి ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో బాగా చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. ముఖ్యంగా స్విమ్మింగ్ లో స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ పోటీల్లో సత్తా చాటింది. ఎన్నో పతకాలు కూడా సొంతం చేసుకుంది

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే సడన్‌గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. అంటే తమ 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి సంగతులు, మధుర జ్ఞాపకాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పలువురు సినిమా తారలు కూడా ‘2016.. నోస్టాల్జిక్ వైబ్స్’ అంటూ పదేళ్ల క్రితం నాటి ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. దీంతో ఇప్పుడు #2016 హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు నెట్టింట బాగావైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ హీరోయిన్ తన పదేళ్ల క్రితం నాటి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. దీంతో ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ బాగా మారిపోయింది. దీంతో చాలా మంది ఈ హీరోయిన్ ను గుర్తు పట్టలేకపోతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతకీ ఈ ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోల్లో ఉన్నది ఒక సౌతిండియన్ క్రేజీ హీరోయిన్. అయితే ఆమెకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. అలాగనీ ఆమె పాతిక, ముప్పై సినిమాలేమీ చేయలేదు. ఇప్పటివరకు కలిపి అన్ని భాషల్లో కేవలం 5 సినిమాల్లోనే నటించింది. అందులో రెండు ఏకంగా పాన్ ఇండియా సినిమాలే. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. హీరోయిన్ గా నటించిన రెండో సినిమాతోనే రూ. 450 కోట్లు రాబట్టిందీ అందాల తార. ఇక సినిమాల్లోకి రాకముందు ఓ సాప్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేసింది ముద్దుగుమ్. ఇంజినీరింగ్ చదివిన ఈ అందాల తార కొన్ని రోజుల పాటు యాక్సెంచర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది. అయితే నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? కాంతారా ఫేమ్ సప్తమి గౌడ.
బెంగళూరులో పుట్టి పెరిగిన సప్తమి గౌడ 2020లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పాప్ కార్న్ మంకీ టైగర్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి సరసన కాంతారా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ది వ్యాక్సిన్ వార్ లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఇక నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తోంది.
పదేళ్ల క్రితం సప్తమి గౌడ..
View this post on Instagram
సప్తమి గౌడ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
