AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరే గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో వారందరికీ ఉచిత సేవలు.. గ్రామాల్లో కూడా..

ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలకు ఉపయోగపడేలా గ్రామీణ ప్రాంతాలకు కూడా వైద్య సేవలను మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా కూటమి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరే గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో వారందరికీ ఉచిత సేవలు.. గ్రామాల్లో కూడా..
Andhra Pradesh
Venkatrao Lella
|

Updated on: Jan 25, 2026 | 3:14 PM

Share

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కిడ్నీ రోగులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పట్టణాలు, సిటీలోని ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం జర్నీ ఖర్చులతో పాటు ఆస్పత్రుల ఖర్చులు బోల్డెంత అవుతాయి. కిడ్నీ రోగులకు ఇది భారంతో కూడుకున్న పని. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఆర్దిక భారమని చెప్పవచ్చు. దీంతో కిడ్నీ రోగులకు భారీ ఊరట కలిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.

13 కొత్త డయాలసిస్ కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 13 డయాలసిస్ కేంద్రాలను కొత్తగా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ తాజాగా ప్రకటించారు. వీటిని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ అధ్వర్యంలో కొన్ని డయాలసిస్ కేంద్రాలు నడుస్తుండగా.. వీటితో కలిపి మొత్తం 25 కేంద్రాలు సేవలు అందిస్తాయని చెప్పారు. దీని వల్ల సామాన్యులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందవచ్చని, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని కిడ్నీ రోగులకు ఉపయోగపడతాయని తెలిపారు. సెకండరీ హాస్పిటల్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటిల్లో రెండు కేంద్రాలను గిరిజన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే ఈ రెండు నెలకొల్పుతామని, మిగతా 11 కేంద్రాలు ఏప్రిల్ నాటికి ప్రారంభిస్తామన్నారు.

నిధులు మంజూరు

ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రొగ్రామ్ క్రింది వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయన్నారు. ప్రస్తుతం ఇవి టెండర్ దశలో ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి, కొండపి, నంద్యాల జిల్లాలోని సున్నిపెంట, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, చిత్తూరు జిల్లాలోని పీలేరు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, తిరుపతి జిల్లాలోని రైల్వేకొండూరు, తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులతో స్పందించి ఈ కేంద్రాలను మంజూరు చేసినట్లు చెప్పారు.  రూ.11.03 కోట్లు ఖర్చు పెట్టి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.  ప్రతీ కేంద్రంలో రూ.85 లక్షల విలువ చేసే పరికరాలు ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాక కొత్తగా ఇప్పటికే  12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. అవి ఇకపై ఫ్రీ
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. అవి ఇకపై ఫ్రీ
పద్మ పురస్కాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ..
పద్మ పురస్కాలను ప్రకటించిన కేంద్రం.. 45మందికి పద్మశ్రీ..
కుమారస్వామి తంగరాజ్‌, మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డులు..!
కుమారస్వామి తంగరాజ్‌, మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డులు..!
ప్రేమ పేరుతో... పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్..
ప్రేమ పేరుతో... పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్..
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..