Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? సినిమా చేస్తే సూపర్ హిట్ అవ్సాల్సిందే.. ఇప్పుడేమో సైలెంట్
పేరుకు మలయాళ నటినే అయినా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీది లక్కీ హ్యాండ్. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లే. అయితే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. ఇంతకీ ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఈమె ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అందం, అభినయం పరంగా మంచి మార్కులే కొట్టేసింది. పేరుకు మలయాళ నటినే అయినా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీది లక్కీ హ్యాండ్. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లే. అయితే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. ఇంతకీ ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సంయుక్తా మేనన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. బుధవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే సంయుక్త కు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన సంయుక్త మేనన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో తన అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందీ మలయాళ కుట్టీ.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మేనన్ నటించిన ‘బింబిసార’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ధనుష్ తో కలిసి నటించి ‘సార్’ మూవీ తెలుగుతో పాటు తమిళంలో మంచి విజయం సాధించింది. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన ఆమె నటించినన ‘విరూపాక్ష’ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్న సంయుక్త ఆ తర్వాత కాస్త స్లో అయ్యింది. కల్యాణ్ రామ్ తో తీసిన డెవిల్ కమర్షియల్ గా ప్లాఫ్ అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే దిల్ రాజు తనయుడు ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మీ సినిమాలో దివ్యవతి పాత్రలో భయ పెట్టింది సంయుక్త. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఇదే. అయితే మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార.
బర్త్ డే బ్యూటీ సంయుక్తా మేనన్ లేటెస్ట్ ఫోటోస్ ఇదిగో..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.