Tollywood: టిక్ టాక్ వీడియోలతో ఫేమస్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఈ క్యూటీని గుర్తు పట్టారా?
ఇప్పుడంటే మన దేశంలో టిక్ టాక్ బ్యాన్ అయ్యింది. కానీ గతంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ఎంతో మంది తమ ట్యాలెంట్ ను చాటుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

టిక్ టాక్ ద్వారా ఎంతో మంది తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటుకున్నారు. ఈ వీడియోల ద్వారానే టిక్ టాక్ దుర్గారావు వంటి వారు ప్రాచుర్యంలోకి వచ్చారు. కొందరు టీవీ షోల్లోకి కూడా అడుగు పెట్టారు. మరికొందరు ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ బ్యూటీ లిప్-సింకింగ్, డబ్ స్మాష్ కామెడీ వీడియోలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. టిక్ టాక్‌లో ఈ బ్యూటీ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 1.1 మిలియన్లు అంటే ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే పాపులారిటీతో బుల్లితెరకు పరిచయమైందీ అందాల తార. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో యాంకర్ అండ్ మెంటార్ గా సక్సెస్ అయ్యింది. ఈ షోతో మరింత క్రేజ్ తెచ్చుకుని వెండితెరపై కి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా మారిన దీపికా పిల్లి. ప్రస్తుతం ఈ అందాల తార మరో స్టార్ యాంకర్ తో ప్రదీప్ మాచి రాజుతో కలిసి ఒక కొత్త సినిమాలో నటిస్తున్నారు.
పవన్ కల్యాణ్ మొదటి సినిమా టైటిల్ ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అమ్మాయి’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రదీప్, దీపికా పిల్లి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ వైబ్ ను తీసుకొచ్చాయి.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో దీపికా పిల్లి..
❤️le le lele First single promo 🤗 pic.twitter.com/NYPJirheIe
— Pradeep Machiraju (@impradeepmachi) November 26, 2024
ఇక దీపికా పిల్లికి ఇది రెండో సినిమా. ఈ సినిమా సక్సెస్ అయితే ఈ అమ్మడికి మరిన్ని చిత్రాల్లో అవకాశాలు రావొచ్చు. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలతోనూ బిజి బిజీగా ఉంటోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ప్రదీప్ మాచిరాజు తో దీపిక..
With lots of Hope & lots of Love ❤️ This one is close to my heart 🥹 To entertain you all🤗….in theatres soon #AAIA #PradeepMachiraju2 is #AkkadaAmmayiIkkadaAbbayi / #అక్కడఅమ్మాయిఇక్కడఅబ్బాయి ❤️🔥
Pairing soon in theatres🫶#AAIA@impradeepmachi… pic.twitter.com/VQxNMHHlON
— Pradeep Machiraju (@impradeepmachi) October 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.