Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. మూడు సినిమాలతోనే 1600 కోట్లు..
బెంగళూరులోని ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తోన్న సమయంలోనే మోడలింగ్ లో అదృష్టం పరీక్షించుకుంది. పలు ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్ గా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ చేసిన మూడు సినిమాలు రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి.

ఎన్‌సీసీ డ్రెస్‌లో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయలేదు. మహా అంటే నాలుగు సినిమాలు చేసింది. అయితే అందులో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. తన అందం, అభినయంతో తెలుగు రాష్ట్రాల్లోనూ తన కంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ చిన్నతనం నుంచే ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది . చదువుకుంటూనే డ్యాన్స్, వాలీబాల్, త్రో బాల్, స్విమ్మింగ్ లో నైపుణ్యం సాధించింది. అలాగనీ చదువుల్లో తక్కువేమీ కాదు. పదో తరగతిలో 94 శాతం మార్కులు సాధించింది. ఇక ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో ఏకంగా 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ కొట్టింది. చదువు తర్వాత ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కూడా చేరింది.. కానీ నటనపై ఆసక్తితో మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోన్న ఈ క్యూటీ మరెవరో కాదు శ్రీనిధి శెట్టి. ఇది ఆమె స్కూల్ డేస్ నాటి ఫొటో.
శ్రీనిధి హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కేజీఫ్. ఈ పాన్ ఇండియా మూవీ రూ. 250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక రెండో సినిమాకు అయితే ఏకంగా రూ. 1250 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే చియాన్ విక్రమ్ తో కలిసి నటించిన మూడో సినిమా కోబ్రా పెద్దగా వసూళ్లు సాధించలేదు. కానీ న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన నాలుగో సినిమా హిట్ 3 ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన మూడు సినిమాలు మొత్తం రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి.
శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక శ్రీనిధి రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డసరసన ‘తెలుసు కదా’ మూవీలో నటిస్తోందీ అందాల తార. వీటితో పాటు కిచ్చా సుదీప్ సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.
View this post on Instagram







