AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అన్నా ఇది నువ్వేనా? ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోను గుర్తు పట్టారా? ఇప్పుడు ఛాన్సుల్లేక..

ఇంజినీరింగ్ పూర్తికాగానే కేవలం 19 ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలోనే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ గా మారిపోయాడు. ఆపై కొన్ని సినిమాల్లో విలన్ గానూ మెప్పించాడు.

Tollywood: అన్నా ఇది నువ్వేనా? ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోను గుర్తు పట్టారా? ఇప్పుడు ఛాన్సుల్లేక..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 17, 2026 | 6:34 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను మొన్నటివరకు టాలీవుడ్ ఫేమస్ హీరో. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించాడు. బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశాడు. కేవలం 19 ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలోనే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు చేశాడు. తన నటనతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అయితే ఉన్నట్లుండి ఫేడవుట్ అయిపోయాడు. దీంతో హీరో కాస్తా సడెన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లోనూ సందడి చేశాడు. కానీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఈ హీరో మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆ మధ్యన కొన్ని సినిమాల్లో సిక్స్ ప్యాక్ తోనూ అభిమాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు బస్ స్టాప్ హీరో ప్రిన్స్ సెసిల్. సినిమాల్లోకి రాక ముందు ఈ హీరో మోడలింగ్ చేసినట్లు తెలుస్తోంది.పై ఫొటో అప్పటిదేనని తెలుస్తోంది. కాగా 2012లో నీకు నాకు డ్యాష్ డ్యాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్. ఆ తర్వాత బస్ స్టాప్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రొమాన్స్, బన్నీ అండ్ చెర్రీ, డాలర్స్ కాలనీ, వేర్ ఈజ్ విద్యాబాలన్, నేను శైలజ, మిస్టర్, అశ్వద్ధామ, పవర్ ప్లే తదితర సినిమాల్లో నటించాడు. డీజే టిల్లు, స్కంద తదితర సినిమాల్లో నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు. లేటెస్ట్ గా శివాజీ, లయ జంటగా నటించిన సాంప్రదాయనీ సుప్పిని శుద్ధ పూసనీ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ప్రిన్స్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు ప్రిన్స్. తన ఫిట్ నెస్ అండ్ జిమ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us