Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. ఒంటిపై ఆ టాటూ అర్థమేంటో తెలుసా..

స్టార్ హీరో వారసురాలు అయినా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. కథానాయికగానే కాకుండా సింగర్‏గానూ ఈ అమ్మాయికి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోయినా.. ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. కానీ ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. ఒంటిపై ఆ టాటూ అర్థమేంటో తెలుసా..
Actress
Follow us

|

Updated on: Nov 21, 2023 | 11:47 AM

పైన ఫోటోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ?.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. స్టార్ హీరో వారసురాలు అయినా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. కథానాయికగానే కాకుండా సింగర్‏గానూ ఈ అమ్మాయికి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోయినా.. ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. కానీ ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. త్వరలోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్. నిత్యం నెట్టింట లేటేస్ట్ క్రేజీ ఫోటోలతో రచ్చ చేసే శ్రుతి తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

బ్లాక్ ట్రెండీ డ్రెస్‏లో క్రేజీ స్టిల్స్‏తో అదరగొట్టేసింది శ్రుతి. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే తన భుజం మీద టాటూకు అర్థం ఆమె పేరే. తమిళంలో శ్రుతి అని టాటూ వేయించుకుంది. అంతేకాకుండా ఆమెకు మరో నాలుగు టాటూలు ఉన్నాయి. గతంలో తన టాటూకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. నా పేరును పెద్దగా అరిచి చెప్పండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మల్టీటాలెంటెడ్‏గా నిరూపించుకున్న శ్రుతి హాసన్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇప్పుడు ఈ బ్యూటీ సలార్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది శ్రుతి. కొద్ది రోజుల క్రితం ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ మాట్లాడుతూ 30 ఏళ్లు దాటాక తన జీవితంలో అనేక మార్పులు వచ్చాయని.. అలాగే పెళ్లి విషయంపై తనపై ఒత్తిడి ఉందన్నారు. 30 ఏళ్లు దాటిన తర్వాత తనకు చాలా ధైర్యం వచ్చిందని..ఇప్పుడు దేనికైనా సమాధానం చెప్పేస్తున్నాని అన్నారు. పెళ్లెప్పుడూ చేసుకుంటావ్ అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారని.. 30 దాటితే సమస్యగా భావిస్తున్నారని తెలిపింది.

కుప్పకూలిన అపార్ట్మెంట్ గోడ.. భయాందోళనలో స్థానికులు..
కుప్పకూలిన అపార్ట్మెంట్ గోడ.. భయాందోళనలో స్థానికులు..
క్యాబ్‌ రంగంలోకి దూసుకొస్తున్న ర్యాపిడో.. డ్రైవర్లకు ఇక పండగే..!
క్యాబ్‌ రంగంలోకి దూసుకొస్తున్న ర్యాపిడో.. డ్రైవర్లకు ఇక పండగే..!
దూసుకొచ్చిన యంగ్ సెన్సేషన్‌.. టాప్‌లో ఐదుగురు టీమిండియా ప్లేయర్స్
దూసుకొచ్చిన యంగ్ సెన్సేషన్‌.. టాప్‌లో ఐదుగురు టీమిండియా ప్లేయర్స్
ఆ ఒక్క పనితో మీ రిటైర్‌మెంట్‌ లైఫ్‌ హ్యాపీ..
ఆ ఒక్క పనితో మీ రిటైర్‌మెంట్‌ లైఫ్‌ హ్యాపీ..
విద్యుత్‌తో నడిచే ట్రైన్‌లలో ఎందుకని రైలుఅంతటా కరెంట్‌ వ్యాపించదు
విద్యుత్‌తో నడిచే ట్రైన్‌లలో ఎందుకని రైలుఅంతటా కరెంట్‌ వ్యాపించదు
ఇక ఇంద్రకీలాద్రిపై ఆ కష్టాలుండవు.. సరికొత్త హంగులతో అమ్మవారి ఆలయం
ఇక ఇంద్రకీలాద్రిపై ఆ కష్టాలుండవు.. సరికొత్త హంగులతో అమ్మవారి ఆలయం
తుఫాన్ నుంచి తన పిల్లలను ఈ కుక్క ఎలా కాపాడిందో చూస్తే..
తుఫాన్ నుంచి తన పిల్లలను ఈ కుక్క ఎలా కాపాడిందో చూస్తే..
ఆ రాశుల వారి కుటుంబాల్లో ఇక శుభ కార్యక్రమాలు..!
ఆ రాశుల వారి కుటుంబాల్లో ఇక శుభ కార్యక్రమాలు..!
వేగంగా నడిస్తే డయాబెటిస్‌ కంట్రోల్‌ అవుతుందా?
వేగంగా నడిస్తే డయాబెటిస్‌ కంట్రోల్‌ అవుతుందా?
జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ప్రణబ్‌ కూతురి పుస్తకం
జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ప్రణబ్‌ కూతురి పుస్తకం