- Telugu News Photo Gallery Cinema photos Actor Mansoor Ali Khan Shocking Comments on Actress Trisha update Telugu Heroines News
Trisha Krishnan: త్రిషపై అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్.! ఇంత రచ్చకెక్కేలా ఏమన్నారు.?
ఒక సీనియర్ ఆర్టిస్ట్ అన్న మాటలకు త్రిష తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇప్పటిదాకా నాతో పనిచేయని వ్యక్తి, భవిష్యత్తులో కనీసం నేను పనిచేయాలనుకోని వ్యక్తి నా గురించి అన్నేసి మాటలు ఎలా అనగలిగాడని భగ్గుమంటున్నారు త్రిష. ఆమెకు గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇంతకీ అసలు ఏమైంది? త్రిషకు అంత కోపం ఎందుకొచ్చింది? లియో సినిమాలో త్రిషను నేను బెడ్‌రూమ్‌కి ఎత్తుకుని వెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నానని మన్సూర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 21, 2023 | 11:54 AM

ఒక సీనియర్ ఆర్టిస్ట్ అన్న మాటలకు త్రిష తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇప్పటిదాకా నాతో పనిచేయని వ్యక్తి, భవిష్యత్తులో కనీసం నేను పనిచేయాలనుకోని వ్యక్తి నా గురించి అన్నేసి మాటలు ఎలా అనగలిగాడని భగ్గుమంటున్నారు త్రిష. ఆమెకు గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇంతకీ అసలు ఏమైంది?

త్రిషకు అంత కోపం ఎందుకొచ్చింది? లియో సినిమాలో త్రిషను నేను బెడ్‌రూమ్‌కి ఎత్తుకుని వెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నానని మన్సూర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. త్రిషను నా కంటికే చూపించలేదు.

అసలు కశ్మీర్‌లో ఆమె పాదాలను కింద పెట్టనివ్వలేదు యూనిట్ అంటూ మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు నెటిజన్లు. విజయ్, త్రిష నటించిన లియో సినిమాలో మన్సూర్ కీ రోల్ చేశారు.

మన్సూర్ మాటలకు స్పందించారు త్రిష. అతనితో ఇప్పటిదాకా నటించలేదు. భవిష్యత్తులో నటించాలని అనుకోవడం లేదు. మానవ జాతికి పట్టిన చెద ఇలాంటి వ్యక్తి అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు.

అతని మాటలు వినడానికి అసభ్యకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ఈ విషయం మీద స్పందించారు. మన్సూర్ మాటలను తప్పుబట్టారు. ఏ రంగంలోనైనా కొలీగ్స్ కి గౌరవం ఇవ్వాలని అన్నారు.

సింగర్ చిన్మయి శ్రీపాద కూడా మన్సూర్ మాటలను దుయ్యబట్టారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను ప్రస్తావించారు. అక్టోబర్ 19న విడుదలైంది లియో మూవీ. దాదాపు 600 కోట్లు వసూలు చేసి జైలర్ కలెక్షన్లను దాటింది లియో. ఈ చిత్రంలో విజయ్ భార్యగా నటించారు త్రిష.





























