Tollywood: తెలుగుమ్మాయి వెండితెరపై సందడి.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలారా ?..
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టం. ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ అంటే అంతగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి. తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన వారిలో ఈ చిన్నారి కూడా ఉంది. కేవలం కథానాయికగానే కాకుండా.. సహయనటిగా కనిపిస్తూ మెప్పిస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.

తెలుగు సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలు స్టార్ హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టం. ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ అంటే అంతగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి. తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన వారిలో ఈ చిన్నారి కూడా ఉంది. కేవలం కథానాయికగానే కాకుండా.. సహయనటిగా కనిపిస్తూ మెప్పిస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ అనన్య నాగళ్ల.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది అనన్య. హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసిన అనన్య. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ గా వర్క్ చేసింది. ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటనవైపు అడుగులు వేసింది అనన్య. షాది అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది.
ఇక ఆ తర్వాత యంగ్ హీరో ప్రియదర్శి నటించిన మల్లేళం సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈసినిమా తర్వాత ప్లేబ్యాక్ సినిమాలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది. ఈ మూవీతో అనన్యకు మరింత పాపులారిటీ వచ్చేసింది. ఈ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి చిత్రాల్లో కనిపించింది అనన్య.
View this post on Instagram
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం అనన్యకు ఇన్ స్టాలో 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న అనన్య… తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




