Tollywood: ఇంత ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టండి.. ఫాలోయింగ్ మాత్రం మాములుగా ఉండదు..
అందమెంత ఉన్న ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఓవైపు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక ఈ అమ్మడు నటించిన లేటేస్ట్ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించి మెప్పించింది.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే అందమెంత ఉన్న ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఓవైపు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక ఈ అమ్మడు నటించిన లేటేస్ట్ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఇప్పటికే మీరు గుర్తుపట్టే ఉంటారు కదూ.. ముద్దుగా కనిపిస్తోన్న ఆ చిన్నారి మరెవరో కాదు.. టాలీవుడ్ సినీ ప్రియులకు సుపరిచతమైన రాధిక అలియాస్ నేహా శెట్టి.
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాతో నేహాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
View this post on Instagram
ప్రస్తుతం ఆమె గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తుంది. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ దాస్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
View this post on Instagram
అలాగే యంగ్ హీరో కార్తికేయ జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది నేహా. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం సిద్ధూ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న డీజే టిల్లు 2 లోనూ నేహా గెస్ట్ అప్పీరియన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సిక్వెల్ గా రాబోతుంది ఈ చిత్రం. ఇందులో నేహా అతిధి పాత్రలో కనపించనుందని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
