Tollywood: రజినీకాంత్.. ధనుష్‌తో కలిసి ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా ?.. మ్యూజిక్ డైరెక్టర్.. ఫేమస్ సింగర్..
సూపర్ స్టార్ రజినీ కాంత్, హీరో ధనుష్‌తో అంత క్లోజ్‌గా ఉన్న చిన్నోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు..మంచి సింగర్ కూడా. అతను కంపోజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్. అతను పాడిన పాటలు శ్రోతల హృదయాలను ఆకట్టుకుంటాయి. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించాడు. అలాగే ఎన్నో మంచి సాంగ్స్ ఆలపించి మెప్పించాడు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇటీవలే హిందీలో ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. సూపర్ స్టార్ రజినీ కాంత్, హీరో ధనుష్‌తో అంత క్లోజ్‌గా ఉన్న చిన్నోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు..మంచి సింగర్ కూడా. అతను కంపోజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్. అతను పాడిన పాటలు శ్రోతల హృదయాలను ఆకట్టుకుంటాయి. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించాడు. అలాగే ఎన్నో మంచి సాంగ్స్ ఆలపించి మెప్పించాడు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇటీవలే హిందీలో ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. గుర్తుపట్టారా ?..ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. 10 ఏళ్ల వయసు నుంచే సంగీత ప్రపంచంలో విజయాలను సాధిస్తున్నాడు. ఇప్పుడు అతడే టాప్ సెన్సెషన్. ఎవరో గుర్తుపట్టారా ?.. అతడే మ్యూజిక్ డైరెక్ట్ర అనిరుధ్ రవిచంద్రన్.
2011లో వై దిస్ కొలవెరి పాటతో ఒక్కసారిగా పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించాడు. ధనుష్ నటించిన 3D సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అనిరుధ్ అందించిన మొదటి పాట వై దిస్ కొలవరి. అటు సంగీత దర్శకుడిగా.. ఇటు సింగర్ గా ఫుల్ బిజీ అయ్యాడు అనిరుధ్. దాదాపు 50 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. తమిళ్ సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం అందించాడు. చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నాడు. లండన్ లో ఫేమస్ మ్యూజిక్ కాలేజీ ట్రినిటీలో పియానో నేర్చుకుని.. అక్కడ ఫ్యూజన్ బ్యాండ్ లో పనిచేశాడు. అనంతరం చెన్నైలో సౌండ్ ఇంజనీరింగ్ కోర్సు చేశాడు. అందుకే సినీ సంగీత ప్రపంచంలో అద్భుతమైన మ్యూజిక్ అందించాడు అనిరుధ్.
View this post on Instagram
సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో అనిరుధ్ కు మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. అనిరుధ్ తమిళ్ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు. ఆయన రజినీకి చాలా దగ్గరి బంధువు. తలైవా భార్య లతా రజినీకి మేనల్లుడు అవుతాడు అనిరుధ్. అందుకే రజినీకాంత్ కు అనిరుధ్ అంటే చాలా ఇష్టం. సుమారు 30 ఏళ్ల క్రితం రజినీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అనిరుధ్ ను అక్కడకి తీసుకువెళ్లారు లత. ఆ సమయంలో రజినీ అనిరుధ్ ను ఎత్తుకుని ఫోటో దిగారు. అదే ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.