Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ధనుష్ వెనక ఉన్న ఆ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు పోషించిన అతను.. ఇప్పుడు హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు అతని పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ఇప్పుడు తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ?.. ఎక్కుడున్నాడో కనిపెట్టారా ?.. పైన ఫోటోలో ధనుష్ గ్యాంగ్‏లో వెనక నిల్చున్న హీరో మరెవరో కాదండి.. కోలీవుడ్ స్టార్

Tollywood: ధనుష్ వెనక ఉన్న ఆ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2023 | 4:29 PM

పైన ఫోటోలో హీరో ధనుష్ గ్యాంగ్‏లో ఓ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు పోషించిన అతను.. ఇప్పుడు హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు అతని పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ఇప్పుడు తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ?.. ఎక్కుడున్నాడో కనిపెట్టారా ?.. పైన ఫోటోలో ధనుష్ గ్యాంగ్‏లో వెనక నిల్చున్న హీరో మరెవరో కాదండి.. కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్.. అలియాస్ విజయ్ సేతుపతి. ఒకప్పుడు కనీసం ప్రేక్షకులకు అతడి పేరు కూడా తెలియదు.. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో. సేతుపతిని ప్రజలు ప్రేమగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ధనుష్, విజయ్ రేర్ ఫోటోను సేతుపతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. గతేడాది నేషనల్ ధనుష్‏తోపాటు విజయ్ నేషనల్ అవార్డ్ అందుకున్న ఫోటోను జతచేస్తూ.. ఒకప్పుడు హీరో వెనక.. ఇప్పుడు ధనుష్‏తోపాటు ఓకే వేదికపై నేషనల్ అవార్డ్ అందుకున్న మక్కల్ సెల్వన్ అంటూ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.

విజయ్ సేతుపతి.. సినిమాల్లోకి అడుగుపెట్టకముందు దుబాయ్‏లో పనిచేసేవారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు విజయ్. మొదట్లో సినిమాల్లో హీరో స్నేహితుడిగా, సహాయ పాత్రలలో కనిపించేవారు. జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‍గా ఎదగడం వరకు విజయ్ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొన్నాడు. కానీ తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని ఇప్పుడు ఎంతో మంది అభిమానులను గెలుచుకున్నాడు విజయ్. 2012లో పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. కానీ ఆ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో సేతుపతికి అంతగా గుర్తింపు రాలేదు.

Vijay Sethupathi, Dhanush

Vijay Sethupathi, Dhanush

ఆ తర్వాత తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులో డబ్ కాగా.. మిశ్రమ స్పందన అందుకున్నాయి. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా.. పూర్తిగా నెగిటివ్ రోల్ పోషించాడు విజయ్. అప్పటివరకు స్టార్ హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్న విజయ్.. తెలుగులో మాత్రం విలన్ పాత్రలో అదరగొట్టేశారు. ఇందులో రాయనంగా విజయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంటో ఇటు తెలుగులో విజయ్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇటీవలే షారుఖ్, నయనతార జంటగా నటించిన జవాన్ చిత్రంలోనూ కనిపించాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మేరీ క్రిస్మస్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.