Payal Rajput: ‘నాకు మాటలు రావడం లేదు’.. భావోద్వేగానికి గురైన పాయల్ రాజ్‌పుత్.
2018లో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 తర్వాత పాయల్‌కు మళ్లీ సరైన విజయం దక్కలేదు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మంగళవారంపైనే పాయల్ ఆశలన్నీ పెట్టుకుంది. పాయల్ కెరీర్ ఇబ్బందిలో పడుతోందని అనుకుంటున్న సమయంలో మంగళవారం సినిమా వచ్చింది. నవంబర్ 17వ తేదీన విడుదలైన...
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంత్రగుద్ధుల్ని చేసిందీ బ్యూటీ. తొలి సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ విజయాలు మాత్రం దక్కలేవు.
2018లో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 తర్వాత పాయల్‌కు మళ్లీ సరైన విజయం దక్కలేదు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి కూడా సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మంగళవారంపైనే పాయల్ ఆశలన్నీ పెట్టుకుంది. పాయల్ కెరీర్ ఇబ్బందిలో పడుతోందని అనుకుంటున్న సమయంలో మంగళవారం సినిమా వచ్చింది. నవంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. మొదటి షో నుంచి ఈ సినిమాకు మంచి టాక్ సంపాదించుకుంది.
View this post on Instagram
మిస్టరీ, బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే సరైన సమయంలో సరైన విజయం దక్కడంతో పాయల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. సక్సెస్ మీట్‌లో పాల్గొన్న నటి పాయల్ రాజ్‌పుత్ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేసింది.
View this post on Instagram
ఈ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్.. ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైందన్న పాయల్.. ‘మంగళవారం’ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఎంతో సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చింది. తన సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు చాలడం లేదన్న పాయల్.. టాలీవుడ్‌లో తనను మరోసారి హీరోయిన్‌గా లాంచ్ చేసిన దర్శకుడు అజయ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ రోజు తన శ్రమకు తగిన ఫలితం దక్కిందన్న పాయల్.. గత మూడేళ్లుగా ఇలాంటి ఆదరణ కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తనకు మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది.
మంగళవారం సినిమా ట్రైలర్…
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..