Tollywood : ఒక్క సాంగ్‌తో పెరిగిపోతున్న సినిమా రేంజ్.. పాపులర్ పాటే మూవీకి భారీ ప్రమోషన్

ఒక్క సాంగ్ ప్లీజ్...! ఒకేఒక్క సాంగ్ ప్లీజ్...! ఇదీ పెద్ద సినిమాల మేకర్స్ నుంచి గట్టిగా వినిపిస్తున్న డిమాండ్. మిగతా రూట్లలో సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా, దాన్ని రిలీజ్ దాకా నడిపించే సత్తా ఒక్క పాపులర్ సాంగ్ కే వుందన్నది రిపీటెడ్ గా ప్రూవ్ అవుతున్న విషయం.

Tollywood : ఒక్క సాంగ్‌తో పెరిగిపోతున్న సినిమా రేంజ్.. పాపులర్ పాటే మూవీకి భారీ ప్రమోషన్
Songs
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 15, 2022 | 7:32 PM

Tollywood : ఒక్క సాంగ్ ప్లీజ్…! ఒకేఒక్క సాంగ్ ప్లీజ్…! ఇదీ పెద్ద సినిమాల మేకర్స్ నుంచి గట్టిగా వినిపిస్తున్న డిమాండ్. మిగతా రూట్లలో సినిమాకు ఎంత ప్రమోషన్ చేసినా, దాన్ని రిలీజ్ దాకా నడిపించే సత్తా ఒక్క పాపులర్ సాంగ్ కే వుందన్నది రిపీటెడ్ గా ప్రూవ్ అవుతున్న విషయం. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకైతే ఆ పాటే ఒక అత్యవసరంగా మారిందిప్పుడు. విచ్చుకత్తి లాంటి ఈ నాటు పాటే ట్రిపులార్ సినిమాకు ఊహకందనంత హైప్ ని తీసుకొచ్చింది. లిరికల్ వెర్షన్ తోనే నేషనల్ క్రేజ్ సొంతం చేసుకుంది. జక్కన్న టీమ్ ఎక్కడికెళ్లినా వాళ్ళ వెంటే నడిచింది. ఇప్పుడొచ్చిన నాటునాటు ఫుల్ వీడియో వెర్షన్.. ట్రిపులార్ సినిమాకు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కి స్పెషల్ ఎలిమెంట్ గా పనికొస్తోంది. పాస్ బట్టన్ నొక్కినొక్కి, లూప్ లో పెట్టుకుని మరీ చూస్తున్నారు తారక్ అండ్ చరణ్ ఫ్యాన్స్. ఎవరి డాన్స్ లో ఎంత పవరుందో ఎవరికివాళ్లు లెక్కలేసుకుంటున్నారు. వ్యూస్ అండ్ లైక్స్ లో కూడా రాటుదేలిపోయిందీ ఊరనాటుపాట. కట్ చేస్తే, దాదాపుగా అదే సీజన్లో వచ్చిన శ్రీవల్లి పాట పుష్ప సినిమాను టాప్ గేర్లోకి తీసుకొచ్చి.. సోషల్ మీడియాను మోతెక్కించింది.

దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్ ఒక ప్రాణమైతే, వంగిన భుజంతో చెప్పులొదిలిపెట్టి ఐకాన్ స్టార్ వేసిన ఆ స్టెప్.. పాటకు రెండో ప్రాణమైంది. సామిసామి సాంగ్ రష్మికను పాపులర్ చేస్తే, శ్రీవల్లి పాట టోటల్ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్ ఆపాదించింది. ఐదు భాషల్లోనూ కలిపి వెయ్యి మిలియన్లను దాటి స్కోర్ చేసింది శ్రీవల్లి. ఇప్పుడు బీస్ట్ సినిమాక్కూడా అటువంటి లడ్డూ లాంటి పాటే ఒకటి దొరికేసింది. కవర్ సాంగ్స్ చేయడంలో స్పెషలిస్టుగా పేరున్న అనిరుద్.. బీస్ట్ కోసం ఇచ్చిన ‘ది బెస్ట్’ సింగిల్.. అరబిక్ కూత్తు. లోకల్ స్లాంగ్ నీ, అరబిక్ ఫ్లేవర్ తో కలిపి శివకార్తీకేయన్ రాసిన పాటకు జానీ మాస్టర్ ఇచ్చిన కొరియోగ్రఫీ.. మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేసింది. పేరుమోసిన సెలబ్రిటీస్ కూడా ఈ పాటకు పడిపోయారు. వేలకొద్దీ రీల్స్ పుట్టుకొచ్చాయి. సినిమా రిలీజయ్యే సమయానికి 300 మిలియన్లు క్రాస్ చేసింది అరబిక్ కూతు పాట. మరో నెలరోజుల్లో రాబోయే సర్కారువారి పాటకు ఊతమిస్తోన్న కళావతి పాటది కూడా అదే రూటు. ఆ మోడ్రన్ మెలోడియస్ బీట్ ఇప్పటికీ సినీజనం గుండెల్ని మీటుతూనే వుంది. ఈ విధంగా ఒక్కగానొక్క పాపులర్ పాటే భారీ సినిమాల పాలిట పెట్టని పెట్టుబడిగా మారుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anupama Parameswaran : బీస్ట్ పాటకు బ్యూటీ డ్యాన్స్.. అరబిక్ కుతుకు అందాల అనుపమ స్టెప్పులు

Mahesh Babu : మహేష్‌తో జక్కన్న కొత్త ప్రయోగం.. టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సబ్జెక్ట్‌తో…

Ileana Dcurz: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమే.. అయితే ఆ కారణంతో కాదు.. అసలు విషయం చెప్పేసిన ఇల్లీ బేబీ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!