AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మహేష్‌తో జక్కన్న కొత్త ప్రయోగం.. టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సబ్జెక్ట్‌తో…

మహేష్ బాబు మూవీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్. దాదాపు రెండేళ్లు అయ్యింది మహేష్ నుంచి సినిమా వచ్చి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్..

Mahesh Babu : మహేష్‌తో జక్కన్న కొత్త ప్రయోగం.. టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సబ్జెక్ట్‌తో...
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2022 | 4:47 PM

Share

మహేష్ బాబు(Mahesh Babu) మూవీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్. దాదాపు రెండేళ్లు అయ్యింది మహేష్ నుంచి సినిమా వచ్చి. సరిలేరు నీకెవ్వరు(Sarileru Neekevvaru) సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్.. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో రాబోతున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా పడుతూ లేస్తూ వస్తుంది. సంక్రాంతి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది. మే 12న ముహూర్తం ఫిక్స్ చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది సర్కారు వారిపాట. ఇక మహెహ్ నెక్స్ట్ జక్కన్న తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ..  జక్కన్న ప్రతి ఇంటర్వ్యూలో నెక్స్ట్ మహేష్ సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే మహేష్ తో రాజమౌళి సినిమా ఎలా ఉండబోతుంది. ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు. దాంతో మహేష్ అడ్వెంచరల్ మూవీ చేస్తున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పుడు మహేష్ మూవీ స్టోరీ అంటూ మరో న్యూస్ సర్కిలేట్ అవుతుంది. జక్కన్న మహేష్ కోసం టైం ట్రావెల్ స్టోరీని రెడీ చేస్తున్నారట. ఈ మూవీలో మహేష్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలా మూడు కాలాల్లో ట్రావెల్ చేస్తాడట. ఈ సబ్జెక్ట్ తోనే మహేష్ మూవీని రెడీ చేస్తున్నాడట దర్శక ధీరుడు. ఇందుకోసం 400 కోట్ల బడ్జెట్ ను కూడా ప్లాన్ చేశారట. మూడు కాలల్లో మహేష్ ట్రావెలింగ్ మెస్మరైజ్ చేస్తుందన్న టాక్. అంతే కాదు ఈ కథకు జేమ్స్ బాండ్ టైప్ స్పై స్టోరీని కూడా యాడ్ చేస్తున్నారట. మొత్తానికి మహేష్ తో జక్కన్న కొత్త ప్రయోగానికి తెరలేపుతున్నారని గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lambasingi Movie: బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి కొత్త సినిమా టైటిల్‌ ఖరారు.. స్వచ్ఛమైన ప్రేమ కథతో..

Prabhas: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన ప్రభాస్.. అప్పుడే అనౌన్స్ చేస్తానంటూ..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?