AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ సినిమా షూటింగ్‌లో ప్రమాదం..ఫైట్ మాస్టర్ మృతి

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ 2. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు. సోమవారం (జులై 15) నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు

Sardar 2: కార్తి 'సర్దార్ 2' సినిమా షూటింగ్‌లో ప్రమాదం..ఫైట్ మాస్టర్ మృతి
Sardar 2 Movie
Basha Shek
|

Updated on: Jul 17, 2024 | 1:03 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ 2. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు. సోమవారం (జులై 15) నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోన్న క్రమంలో ఎజుమలై అనే ఫైట్‌ మాస్టర్‌ సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే స్పందించిన చిత్రబృందం అతనిని ఆస్పత్రికి తరలించింది. అయితే అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఎజుమలై మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటననకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆగిపోయిన షూటింగ్..

మరోవైపు ఈ ప్రమాద ఘటనతో షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై హీరో కార్తీక్, దర్శకుడు పీఎస్ మిత్రన్ నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న సర్దార్ 2 సినిమాలో కార్తీ ద్విపాత్రాభియనం చేస్తున్నాడు. అలాగే మరో నటుడు ఎస్‌.జె.సూర్య ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఇటీవల సినిమా షూటింగుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో కమల్ హాసన్ భారతీయుడు, అలాగే ఎన్టీఆర్ దేవర సినిమా సెట్స్ లోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి

ఇటీవలే చెన్నైలో జరిగిన సర్దార్ 2 పూజా కార్యక్రమాలు.. అంతలోనే ఈ ప్రమాదం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..