Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని పిఠాపురంలో అభిమానుల పూజలు..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని పిఠాపురంలో అభిమానుల పూజలు..
Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 7:50 AM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై సినీ ఇండస్ట్రీ, మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్ధనలు చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయిధర్మతేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు. గ్రామంలో ముంగర్లమ్మవారి గుడివద్ద సాయిధర్మతేజ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అభిమానులు. తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యామని అంటున్నారు అభిమానులు. ఆ విఘ్నేశ్వరుడు, అమ్మవారి కృప సాయి ధర్మతేజ్‌కు ఉండి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు అభిమానులు.

అలాగే  విజయవాడ వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థలో తేజ్ కోసం  ప్రార్థలు కొనసాగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆశ్రమంలోని వృద్ధులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదమేమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. వచ్చే 24 గంటల్లో మళ్లీ పరీక్షలు చేస్తామని అపోలో డాక్టర్లు చెప్పారు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని.. 72గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్లు అపోలో వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఎర్లీ రియాక్షనే ప్రమాదానికి కారణం: ఇంజనీరింగ్ నిపుణులు

Sai Dharam Tej Bikes: సాయి ధరమ్ తేజ్‌ బైక్ లవర్.. మెగా హీరో గ్యారేజ్‌లో మరిన్ని సూపర్‌ బైక్స్‌

Sai Dharam Tej in ICU: ఐసీయూలో తేజు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న జూ. ఎన్టీఆర్ , విజయ్ దేవరకొండ, సినీ నటీనటులు

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.