Rakesh master: రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఈ లోకాన్ని వీడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో డ్యాన్స్ మాస్టర్‌గా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలతో సూపర్ పాపులర్ అయిన రాకేశ్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం రక్తపు వాంతులు, విరేచనాలు అవ్వడంతో.. పరిస్థితి విషమించింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన్ను కాపాడేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు విశ్వప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు.
రాకేష్ మాస్టర్ డయాబెటిక్ అని తెలిసింది. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యింది. బీపీ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. హై షుగర్ ఉండటంతో శ్వాస తీసుకోవటంతో ఇబ్బంది పడ్డారు. కృత్రిమంగా శ్వాసను అందించే ప్రయత్నం చేసినా, వెంటిలేటర్‌పై ఉంచినా ప్రయోజనం లేకపోయింది. రాకేశ్ మాస్టర్ మరణ వార్త తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిన్న మొన్నటివరకు ఆయన వీడియోలు చేశారని.. ఇంతలోనే ఇలా జరగడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మాస్టర్‌కి.. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి చేరకుంటున్నారు. రాకేశ్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. సోమవారం బోరబండలో రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
దాదాపు 1200 వందల సినిమాలకు రాకేశ్ మాస్టర్ పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే. ‘జబర్దస్త్’షోలో కూడా ఆయన పలుసార్లు మెరిశారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో ఆయన ఈ జనరేషన్ కుర్రాళ్లకు బాగా తెలిసిన పర్సన్ అయ్యారు. గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ రాజారావు రాకేశ్ మాస్టర్ మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దిగువన వీడియోలో చూడండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



