Esha Chawla: సినీ తారలను వదలని కరోనా.. ప్రేమ కావాలి హీరోయిన్‌కు పాజిటివ్..
దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. రోజు రోజూకీ కరోనా, ఓమిక్రాన్ కేసుల
దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తుంది. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. రోజు రోజూకీ కరోనా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువవున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించేందుకు సన్నహాలు చేస్తున్నాయి. ఇక సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్రపరిశ్రమపై మరోసారి కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడగా.. ఓ వైపు షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక తారలను సైతం కరోనా ఏమాత్రం వదలడం లేదు. రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, త్రిష, మహేష్ బాబు, హీనా ఖాన్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా మరో యంగ్ హీరోయిన్ ఇషా చావ్లాకు కోవిడ్ సోకింద్. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది.
“హలో ఎవ్రీవన్. లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నాను. కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుత క్యారంటైన్లో ఉన్నాను. అందరూ డిస్టన్స్ మెయింటెన్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి” అంటూ షేర్ చేసింది ఇషా. ఆది సాయి కుమార్ నటించిన ప్రేమ కావాలి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇషా చావ్లా. ఈ సినిమా తర్వాత ఆమె బాలకృష్ణ సరసన శ్రీమన్నారాయణ, పూలరంగడు, mr.పెళ్లి కొడుకు, జంప్ జిలాని వంటి చిత్రాల్లో కనిపించి మెప్పించింది.
ప్రస్తుతం ఇషా చావ్లా.. కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న దివ్య దృష్టి సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..
Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన అర్జున్ కపూర్..