Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు సర్‍ప్రైజ్ ఇచ్చిన రాధేశ్యామ్ టీం.. అందమైన వీడియో షేర్ చేస్తూ..
మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్(Radhe Shyam). యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి.

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్(Radhe Shyam). యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా… కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవిలో మార్చి 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ రాధేశ్యామ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న సమయంలో తాజాగా రాధేశ్యామ్ టీం సర్ప్రైజింగ్ ఇచ్చింది.
గురువారం మధ్యాహ్నం రాధేశ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి… డార్లింగ్ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే లుక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 25న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్..జస్టిస్ శంకర్ మ్యూజిక్ అందించగా.. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. విడుదలైన కాసేపట్లోనే ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
వింటేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ పాత్రను మహేష్ పరిచయం చేయడమే కాకుండా మధ్య మధ్య లోకూడా మహేష్ వాయిస్ వినిపిస్తుందట. అలాగే క్లైమాక్స్ లోకూడా మహేష్ వాయిస్ ఉంటుందని అంటున్నారు.
Also Read: Hamsa Nandini: క్యాన్సర్‌తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..
Bigg Boss Ultimate: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా ఆ స్టార్ హీరో.. కొత్త ప్రోమో అదుర్స్..
Viral Video: ఇదేక్కడి తెలివిరా బాబు.. ఫోన్ దొంగిలించాడు.. చివరకు ఊహించని షాక్..
