Ee Nagaraniki Emaindi: యూత్ మెచ్చిన సినిమా మళ్లీ వచ్చేస్తోంది.. ‘ఈ నగరానికి ఏమైంది’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..

|

Jun 14, 2023 | 8:02 PM

అదే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ నగరానికి ఏమైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేష్, సాయి సుశాంత్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2018లో జూన్ 29న విడుదలైంది. అప్పుడే ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలంటూ చాలా మంది రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Ee Nagaraniki Emaindi: యూత్ మెచ్చిన సినిమా మళ్లీ వచ్చేస్తోంది.. ఈ నగరానికి ఏమైంది రీరిలీజ్ డేట్ ఫిక్స్..
Ee Nagaraniki Emaindi
Follow us on

గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోస్ మూవీ మరోసారి విడుదలై భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆరెంజ్, ఖుషి, జల్సా, ఒక్కడు, బిల్లా.. ఇలా ఎన్నో చిత్రాలు మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ కు సిద్ధమయ్యింది. అదే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ నగరానికి ఏమైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అభినవ్, వెంకటేష్, సాయి సుశాంత్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2018లో జూన్ 29న విడుదలైంది. అప్పుడే ఈ సినిమా బాక్సాఫఈస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలంటూ చాలా మంది రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తైంది. ఈ క్రమంలో మరోసారి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. “ఈ నగరానికి ఏమైంది సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు నిన్ననే వచ్చినట్లుగా ఉంది. మీరంతా కలిసి ఈ సినిమాను సక్సెస్ చేసారు. కానీ ఐదేళ్ల కాలంలో ఎంతో మారింది. నా ప్రతి రూల్ బ్రేకైంది. కిందపడిపోయా.. మళ్లీ అన్నింటిని పునర్మించుకుంటూ వచ్చాను. జూన్ 29న ఈ నగరానికి ఏమైంది సినిమాను రీరిలీజ్ చేస్తున్నాము. కేవలం థియేటర్లలో మాత్రమే కాదని.. ఎంపిక చేసిన క్లబ్, కెఫేలలో విడుదల చేస్తున్నాం. దీంతోపాటు మీకో బహుమతిగా కీడా కోలా సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నాము. అందుకే మరోసారి మిత్రులతో కలిసి ఈసారి సినిమాను చూసి ఎంజాయ్ చేయండి” అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి యూత్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈనగరానికి ఏమైంది.. జూన్ 29న మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించగా.. విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.