SSMB 29 Globetrotter: మహేష్ బాబు ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ పాసులు కావాలా? ఇలా చేస్తే ఈజీగా మీ సొంతం
సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. 'గ్లోబ్ ట్రాటర్' (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది.

ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో గ్లోబ్ ట్రాటర్ (వర్కింగ్ టైటిల్) ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్ వరల్డ్ మూవీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మహేష్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఈ మూవీలో హీరోయిన్ గా నటించడం మరో విశేషం. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ సుకుమారన్ ఇందులో కుంభ అనే ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఎస్‌ఎస్ఎమ్ బీ 29 సినిమాకు సంబంధించి శనివారం (నవంబర్ 15) ఓ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ఆర్ఎఫ్‌సీలో కనీవినీ ఎరుగని రీతలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్ర బృందంతో పాటు అతిరథ మహారథులు ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారని టాక్. అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారని సమాచారం.
కాగా గ్లోబల్ ట్రాట్ ఈవెంట్ పాసుల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవెంట్ పాసులు పొందే ప్రాసెస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాసులు కావాలనుకునే వారు ముందుగా maheshbabufans.net వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మీ సరైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ అవ్వగానే, మీకంటూ ఒక ‘ఎక్స్‌క్లూజివ్ ఫ్యాన్ బ్యాడ్జ్’ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత, రిజిస్టర్ అయిన వారు ఒక కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే ఈజీగా ఎంట్రీ పాసులు..
Gateway to #GlobeTrotterEvent, Here’s How to Get Your Passes:
1.Head over to our website.https://t.co/GDzHFcsVE5 2.Fill in your accurate details and complete the login registration. 3.Once done, your exclusive Fan Badge will be generated. 4.Registered fans will be eligible to…
— GlobeTrotter Fan Club (@GlobetrotterOfl) November 14, 2025
ఆ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి 5 నిమిషాల్లో ‘My Contests’ పేజీలో ఒక యూనిక్ QR కోడ్ బేస్డ్ డిజిటల్ పాస్ వస్తుంది. ఆ QR కోడ్‌ను చూపించి, ఈవెంట్ పాస్‌ను వ్యక్తిగతంగా కలెక్ట్ చేసుకోవాలి. పాస్‌లు లిమిటెడ్‌గా ఉన్నాయని, మొదట రిజిస్టర్ చేసుకున్నవారికే ప్రియారిటీ ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. అలాగే ఒక్కొక్కరు గరిష్టంగా 2 పాసులు మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరని టీమ్ స్పష్టం చేసింది.
పాస్ పోర్టుల తరహాలో ఈవెంట్ పాసులు..
Get your passports and fasten your seat belts😉 Coz this journey will be remeMBered forever🔥🦁#Globetrotter #GlobetrotterEvent @urstrulyMahesh pic.twitter.com/b1umKQKJzA
— Kukatpally DHFMS (@KukatpallyMBFC) November 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








