AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: ‘బేబీ’ మూవీలో హీరోయిన్‌‌కు ఫ్రెండ్‌గా నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?

'అర్జున్ రెడ్డి', 'ఆర్‌ఎక్స్ 100' సినిమాల మాదిరిగా కల్ట్ క్లాసిక్‌లా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది లేటెస్ట్ మూవీ 'బేబీ'. యూత్‌ను బాగా ఆకర్షించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధిస్తూ.. డబుల్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది.

Baby Movie: 'బేబీ' మూవీలో హీరోయిన్‌‌కు ఫ్రెండ్‌గా నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?
Tollywood 1
Ravi Kiran
|

Updated on: Jul 28, 2023 | 4:44 PM

Share

‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాల మాదిరిగా కల్ట్ క్లాసిక్‌లా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది లేటెస్ట్ మూవీ ‘బేబీ’. యూత్‌ను బాగా ఆకర్షించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధిస్తూ.. డబుల్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ లాంటి వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవికి ఇది తొలి చిత్రం. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆదరగొట్టింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ వైష్ణవి ఫ్రెండ్‌గా నటించిన అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇంతకీ ఆమెవరో తెలుసుకుందామా..

మూవీ సెకండాఫ్‌లో హీరోయిన్ ప్రవర్తనకు నచ్చక.. ఆమె ఫ్రెండ్ వైష్ణవికి దూరంగా ఉంటుంది. తాను నటనతో అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె ఫ్రెండ్‌గా నటించిన ఆ చిన్నది ఎవరోనని నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ‘బేబీ’ మూవీలో హీరోయిన్‌‌కు ఫ్రెండ్‌గా నటించిన ఆ అమ్మాయి మరెవరో కాదు.. ఆమె పేరు కుసుమ డేగలమారి. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ. ఇన్‌స్టాలో ఎప్పుడూ వీడియోలు, హాట్ ఫోటోలతో యాక్టివ్‌గా ఉంటుంది. టాలీవుడ్‌లో ఆమెకిదే మొదటి చిత్రం కాగా.. తొలి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే త్వరలోనే ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టే ఛాన్స్ లేకపోలేదు.