AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Muktha: వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..? ఇప్పుడు చూస్తే షాకే..

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత పేరు మార్చుకుంది. మలయాళ చిత్రాల్లో ముక్త అనే పేరుతో నటించిన ఆమె తమిళ సినిమాల్లో భాను అనే పేరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తమీరభరణి భానుగా అభిమానులు పిలుచుకునే ఆమె.. ఆ తర్వాత సినిమాల అవకాశాలు రాకపోవడంతో మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టింది. మళ్లీ తమిళంలో చేరన్ సరసన 'అజగర్ కొట్టి', 'త్రీ పియర్ త్రీ కాదల్' వంటి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు పెద్ద ఆడలేదు.

Actress Muktha: వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..? ఇప్పుడు చూస్తే షాకే..
Muktha
Rajitha Chanti
|

Updated on: Apr 20, 2024 | 6:52 PM

Share

కోలీవుడ్ హీరో విశాల్ కు ఇటు తెలుగులోనూ మంచి పేరు ఉంది. తమిళంలో ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్.. ఆ తర్వాత భరణి సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘తామిరపరణి’ పేరుతో విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ ‘తామిరపరణి’ సినిమాలో నటించి తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ భాను అలియాస్ ముక్త. కేరళకు చెందిన ఈ భామ పుట్టిన పేరు ఎల్జా జార్జ్. కానీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత పేరు మార్చుకుంది. మలయాళ చిత్రాల్లో ముక్త అనే పేరుతో నటించిన ఆమె తమిళ సినిమాల్లో భాను అనే పేరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తమీరభరణి భానుగా అభిమానులు పిలుచుకునే ఆమె.. ఆ తర్వాత సినిమాల అవకాశాలు రాకపోవడంతో మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టింది. మళ్లీ తమిళంలో చేరన్ సరసన ‘అజగర్ కొట్టి’, ‘త్రీ పియర్ త్రీ కాదల్’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు పెద్ద ఆడలేదు.

ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వంలో నయనధర నటించిన ‘వాసు వుమ్ శరవణనుం ఉన్న పడిచవంగా’ చిత్రంలో సంతానం సరసన నటించింది. ‘బంబు చాటై’లో నటుడు బాబీ సింహాకు కోడలిగా భాను నటించింది. నటి బాను 2015లో రింగు టోమీ అనే బిజినెస్ మెన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న భాను.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన కూతురితో కలిసి డాన్స్ రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది.

అలాగే తాజాగా భాను మాస్ డాన్స్ ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయగా తెగ వైరలవుతుంది. భరణి సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఆమెను.. ఇప్పుడు ఇలా మాస్ అవతారంలో చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ మళ్లీ ప్రేక్షకులను అలరిస్తుంది.

View this post on Instagram

A post shared by Muktha (@actressmuktha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.