Ghajini Asin: ఒకప్పుడు కుర్రాళ్ల కలల యువరాణి.. అందంతో మాయ చేసిన ‘గజిని’ సినిమా ఆసిన్ ఇప్పుడేలా ఉందో తెలుసా ? ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం చిత్రంలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో అగ్రకథానాయికగా కొనసాగింది హీరోయిన్ ఆసిన్. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాస్ మాహారాజా రవితేజ సరసన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. ఆ తర్వాత గజిని, శివమణి, లక్ష్మి, చక్రం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం చిత్రంలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఖిలాడి చిత్రంలో నటించి హిట్ అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది.
హీరో అక్షయ్ కుమార్ సరసన ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే రాహుల్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారి.. ఏడడుగులవైపు నడిచింది. రాహుల్ శర్మ్ మైక్రో మ్యాక్స్ అధినేత. వీరిద్దరి వివాహం 2016లో న్యూఢీల్లోని ఓ చర్చిలో జరిగింది. వీరికి ఆరిన్ అనే పాప ఉంది.
సినిమాలకు దూరంగా ఉంటున్న ఆసిన్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. వరుసగా ఫ్యామిలీ ఫోటోస్.. తన పాప ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉండేది ఆసిన్. అయితే ఇటీవల నెట్టింట కూడా సైలెంట్ అయ్యింది. చివరగా.. గతేడాది అక్టోబర్ 24న తన పాప ఆరిన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఎలాంటి పోస్ట్ చేయలేదు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.