AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAILER 2 Teaser: టైగర్ ఈజ్ బ్యాక్.. సూపర్ స్టార్ జైలర్ 2 టీజర్ అదిరిపోయిందిగా..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆకట్టుకునే కథా కథనాలు, అద్భుతమైన నేపథ్య సంగీతం, ముఖ్యంగా స్టార్ హీరోల అతిధి పాత్రలు సినిమాకు భారీ వసూళ్లు తెచ్చిపెట్టాయి. అన్నిటికీ మించి వరుస పరాజయాలతో సతమతమవుతున్న రజనీకాంత్‌కి జైలర్ సినిమా భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా ‘జైలర్ 2’ సినిమా కూడా వస్తోంది.

JAILER 2 Teaser: టైగర్ ఈజ్ బ్యాక్.. సూపర్ స్టార్ జైలర్ 2 టీజర్ అదిరిపోయిందిగా..!
Jailer 2
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2025 | 7:34 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. స్క్రీన్ ప్లే పరంగానూ, కలెక్షన్ల పరంగానూ జనాల ఆదరణ పొందింది జైలర్ సినిమా. అలాగే జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమా చేస్తున్నారు రజినీకాంత్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 టీజర్ ను విడుదల చేశారు.  జైలర్ 1లో రజనీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ, వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్ మరియు యోగి బాబు నటించారు. ఇదే టీమ్ ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్.

తాజాగా విడుదలైం జైలర్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  ఈ టీజర్‌కి జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్‌లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..