నానితో ఉన్న ఈ చిన్నారిను గుర్తుపట్టారా.? ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ వేరే లెవల్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలాగే ఈ సినిమాలో చిన్న పిల్లలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే నిర్మాతగా కోర్ట్ సినిమాతో హిట్ అందుకున్నాడు నాని. అలాగే హీరోగా ఇప్పుడు హిట్ 2, ది ప్యారడైజ్ సినిమాలు చేస్తున్నాడు. నాని సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక నాని నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. వాటిలో కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమా ఒకటి. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఇక ఈ సినిమాలో నానితో కలిసి ముగ్గురు చిన్నారులు నటించారు. తమ క్యూట్ నటనతో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. వారిలో చుట్కీ పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.? ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ చిన్నారి పేరు వాసంతికా. ఆ సినిమా తర్వాత 90’s వెబ్ సిరీస్ లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఫోటోను, 90’s వెబ్ సిరీస్ లో ఫోటోను పక్క ప్-పక్కన పెట్టి ఆ అమ్మడే ఈ అమ్మడు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
వాసంతికా పలు సినిమాల్లోనూ నటించింది. ఇక ఇప్పుడు 90’s వెబ్ సిరీస్ ద్వార మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది. అలా పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ చిన్నది హీరోయిన్ గా అవ్వడం పక్కా అంటున్నారు నెటిజన్స్. ఈ క్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..