అప్పుడు సంతూర్ మమ్మి.. ఇప్పుడు సెన్సేషనల్ బ్యూటీ.. ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్

సినిమాలో చాలా మంది హీరోయిన్స్ గా రాణించిక ముందు చాలా మంది యాడ్స్ లోనూ నటించి మెప్పించారు. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా గతంలో యాడ్ లోనూ నటించింది. గతంలో సంతూర్ యాడ్ లోనూ నటించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఆమె..

అప్పుడు సంతూర్ మమ్మి.. ఇప్పుడు సెన్సేషనల్ బ్యూటీ.. ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్
Actress

Updated on: Sep 06, 2025 | 3:14 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. అవకాశాల కోసం ఎదురుచూసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఈ చిన్నది మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన తండ్రి కల కోసం ఆమె హీరోయిన్ గా మారింది. అంతే కాదు ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. హీరోయిన్ గా మారక ముందు పలు యాడ్స్ లో నటించింది. ముఖ్యంగా సంతూర్ యాడ్ లో నటించింది ఈ చిన్నది. అప్పుడు సంతూర్ మమ్మీ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో స్పిరిట్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సినిమా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ. యానిమల్ సినిమాతో ఈ చిన్నది ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. తృప్తి 2017లో “పోస్టర్ బాయ్స్” అనే కామెడీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2023లో, ఆమె “యానిమల్” సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతృప్తి డిమ్రీ మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

కెరీర్ బిగినింగ్ లో తృప్తి డిమ్రీ పలు యాడ్స్ లో నటించింది. వాటిలో సంతూర్ యాడ్ ఒకటి. సంతూర్ తోపాటు గుడ్ ఎర్త్, పాండ్స్ వంటి బ్రాండ్‌ల కోసం ప్రకటనల్లో కనిపించింది. తృప్తి డిమ్రీ తండ్రి దినేష్ డిమ్రీ రామ్‌లీలా ఉత్సవాల్లో వివిధ పౌరాణిక పాత్రలు పోషించేవాడు. అదే తృప్తికి చిన్నతనంలో నటనపై ఆసక్తిని కలిగించింది. అలాగే తృప్తి డిమ్రీ నటి కావాలన్నది ఆమె తండ్రి కల. ఇక ఇప్పుడు ఈ చిన్నది ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.