Tollywood : అబ్బాయిల ఆరాధ్య దేవత.. గ్లామర్ షోకు దూరం.. అయినా తగ్గని క్రేజ్.. 59 ఏళ్ల వయసులో తరగని అందం..
90లలో అబ్బాయిల డ్రీమ్ గర్ల్ ఆమె. గ్లామర్ షో చేయకుండానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ సినిమా యాక్టివ్ గా ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ఆమె మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లతో నటించింది. ప్రస్తుతం ఆమె వయసు 59 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా జీవిస్తుంది.

సినీరంగంలో అందం, అభినయంతో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా 80, 90వ దశకాలలో వరుస హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకున్న తారల గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్స్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు. అలాగే అప్పట్లో యూత్ మెచ్చిన మరో భామ.. 90’s యూత్ ఆరాధ్య దేవత.. గురించి మీకు తెలుసా.. ? ప్రస్తుతం ఆమె వయసు 59 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తన ప్రేమికుడి గురించి ఆలోచిస్తూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ సితార. 90లలో చాలా మందికి కలల అమ్మాయి.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
1986లో విడుదలైన మలయాళ చిత్రం ‘కావేరి’తో కథానాయికగా పరిచయం కాబోతుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ఈ చిత్రానికి అభిమానులు మంచి ఆదరణ ఇచ్చారు. తెలుగు, తమిళంలో భాషలలో నటించారు. సితార కేరళలోని తిరువనంతపురంలో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను డాక్టర్ కావాలని కోరుకున్నారు. కానీ సితారకు నటనవైపు ఆసక్తి ఏర్పడింది. దీంతో 13 ఏళ్ల వయసులోనే కావేరి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె మొదటి సినిమా విజయం సితారకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. కొన్నాళ్లపాటు సినీరంగంలో హీరోయిన్ గా దూసుకుపోయిన సితార.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో సహాయ నటిగా కనిపించింది. రజినీకాంత్ నటించిన నరసింహా సినిమాలో హీరో చెల్లిగా కనిపించింది. వెండితెరపై అలరించిన ఆమె.. గంగా యమునా సరస్వతి సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
సితార వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. కానీ ఆమె పెళ్లి చేసుకోకుండానే జీవిస్తోంది. సితార ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది. కానీ, ఆమె తండ్రి ఆకస్మిక మరణం ఆమెను మానసికంగా కుంగదీసింది. కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని, తన తండ్రి కోరిక మేరకు తన తమ్ముడిని డాక్టర్‌ను చేసింది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించలేదు. సినిమాపై దృష్టి పెట్టింది. గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఆమెకు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

Sithara New
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
