ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. తెలుగులో లవర్ బాయ్ క్రేజ్.. రోడ్డు యాక్సిడెంట్లో మృతి.. ఈ హీరో గుర్తున్నాడా.. ?
సినీరంగంలో హీరోగా సక్సెస్ కావాలని ఎన్నో కలలు అడుగుపెడుతుంటారు. కానీ కొందరు అవకాశాల కోసం సంవత్సరాలు కష్డపడుతుంటారు. మరికొందరు ఒక్క సినిమాతోనే విజయాన్ని అందుకుంటారు. ఆ తర్వాత వరుస హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకోవాల్సిన సమయంలోనే అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. కానీ ఓ హీరో మాత్రం మొదటి సినిమాతోనే సెన్సేషన్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు.

సినీరంగంలో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. మొదటి సినిమాతోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న కొందరు తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. మరికొందరు అర్థాంతరంగా తనువు చాలించారు. దివ్య భారతి, సౌందర్య, సిల్క్ స్మిత, ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలా ఎంతో మంది తారలు కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో సైతం అభిమానులకు తీరని విషాదాన్ని మిగులుస్తూ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఫస్ట్ మూవీతోనే హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అతడు..సెకండ్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతడు మరెవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరో యషో సాగర్. తొలి చిత్రంతోనే నటనతో జనాల హృదయాలు గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
యషో సాగర్.. అసలు పేరు భరత్. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడిగా కనిపించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ తన కామెడీ టైమింగ్, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో యషో సాగర్ సరసన స్నేహా ఉల్లాల్ కథానాయికగా నటించగా.. బ్రహ్మానందం, సుమన్ శెట్టి కనిపించారు. అయితే తొలి చిత్రంతో మంచి హిట్ అందుకున్న యషో సాగర్.. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరో అయిపోతాడని అనుకున్నారు. కానీ తన రెండవ సినిమా మిస్టర్ ప్రేమికుడు మూవీ షూటింగ్ సమయంలోనే చనిపోయాడు.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
2012 డిసెంబర్ లో ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెన భద్రతా గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనతోపాటు తన స్నేహితుడు విశ్వనాథ్ రెడ్డి సైతం మరణించగా.. వెనక సీట్లో కుర్చున్న మరో స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. 23 ఏళ్లకే హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. రెండో సినిమా చిత్రీకరణ సమయంలోనే మరణించి.. అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. ఇప్పటికీ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
