Tollywood: చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు పెద్ద హీరోయిన్

చిరంజీవి సినిమాలో నటించిన నటులు, చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే. అలాగే పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది. తనెవరో మీరు గుర్తుపట్టారా..?

Tollywood: చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు పెద్ద హీరోయిన్
Anji Movie Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 20, 2024 | 1:00 PM

మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ లెజెండ్. ఆయనతో సిల్వర్ స్క్రీన్‌పై చిన్న సీన్‌లో కనిపించినా చాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు.  ఇక చిరు సినిమాల్లో సైడ్ ఆర్టిస్టులుగా, చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవారు.. ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు కూడా వివిధ విభాగాల్లో రాణిస్తున్నారు. అలానే పైన ఫోటోని గమనించారు కదా. అందులోని చిన్నారి.. చిరు నటించిన అంజి సినిమాలో మంచి రోల్ చేసింది. అంజి మూవీని తెరకెక్కించింది.. దివంగత లెజండరీ దర్శకుడు కోడి రామకృష్ణ. ఇందులో హీరోయిన్‌గా నమ్రత నటించిన విషయం తెలిసిందే. సినిమా టెక్నికల్‌గా ఓ రేంజ్‌లో ఉన్నప్పటికీ.. మిక్డ్స్‌ టాక్ వచ్చింది. ఇక అంజి సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

ఆ పాప అంజి మాత్రమే కాదు చాలా సినిమాల్లో.. బాలనటిగా చేసి.. తన క్యూట్ హావభావాలు.. ముద్దుముద్దు మాటలతో.. ప్రేక్షకులను అలరించింది. తను మరెవరో కాదండోయ్.. ప్రస్తుత హీరోయిన్‌ ‘నిత్యాశెట్టి’. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన బేబీ నిత్యాశెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే.. అంజి సినిమాలో నటించిన పాప అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతలా తను ఛేంజ్ అయింది. నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

నువ్వు తోపురా అనే సినిమాతో నిత్యా శెట్టి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా.. ‘ఓ పిట్టకథ’, ‘వాంటెడ్ పండుగాడు’ వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఆ సినిమాలేవి ఈ బ్యూటీకి మంచి విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. తాజాగా నిత్యాశెట్టి లేటెస్ట్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ నిత్యా చాలా బ్యూటీఫుల్‌గా ఉందని.. కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క హిట్ పడితే.. పాప ఫేట్ మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ