దళపతి విజయ్ కు టాలీవుడ్ లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాలు మనదగ్గర కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల పై దృష్టి పెట్టనున్నాడని టాక్. ఇదిలా ఉంటే విజయ్ తమిళ్ దర్శకులతోనే కాదు మన తెలుగు దర్శకుడితోనూ చేసి హిట్ అందుకున్నారు. ఆ సినిమానే వారసుడు. దిల్ రాజు నిర్మిచిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే వారసుడు సినిమాలో చాలా మంది నటించారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న భామ కూడా.. ఇంతకూ ఆమెను గుర్తుపట్టారా.? వారసుడు సినిమాలో శ్రీకాంత్ కూతురిగా నటించింది ఆ చిన్నది.
వారసుడు సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఆ అమ్మడి పేరు సంజన తివారి. ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలు కూడా చేసింది. కాగా ఇప్పుడు ఈ వయ్యారి భామ ఎలా ఉంది అని నెటిజన్స్ గూగుల్ లో గాలిస్తున్నారు. సినిమాల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్స్ కు మించి అందాలతో కవ్విస్తుంది సంజన. ఇప్పుడు ఈ అమ్మడు మరింత అందంగా తయారయ్యింది. ఈ క్రేజీ బ్యూటీ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి