Bision Movie: ఒకప్పుడు కబడ్డీ జెర్సీ కొనడానికి డబ్బు లేదు.. తెలుగు టైటన్స్ స్టార్ ప్లేయర్.. బైసన్ సినిమాలో నటించిన ఇతడిని గుర్తుపట్టారా.. ?
చియాన్ విక్రమ్.. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో. విభిన్న కంటెంట్ చిత్రాలతో ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అతడు నటించిన బైసన్ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేషన్ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. మొదటి నుంచి మంచి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ మెప్పు పొందింది. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ధృవ్ విక్రమ్ నటించిన ఈ సినిమాలో నిజ జీవిత కబడ్డీ ప్లేయర్ ప్రభంజన్ నటించారు.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
ఈ చిత్రంలో ఆయన భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ రాజరత్నం పాత్రను పోషించారు. ఇందులో భారత జట్టు కెప్టెన్‌గా ధ్రువ్ విక్రమ్‌కు రత్నం పాత్రలో మద్దతు ఇస్తుంటారు. అలాగే ఇందులో ప్రభంజన్ ఆటతీరు చూస్తే సులభంగా గుర్తుపడతారు. ‘బైసన్’ చిత్రంలో కెప్టెన్‌గా నటించిన ప్రబంజన్, ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో తమిళ తలైవాస్ కబడ్డీ జట్టు తరపున ఆడాడు. ప్రబంజన్ సేలం జిల్లాలోని సంగకిరికి చెందిన వ్యక్తి. ప్రభంజన్ తండ్రి..బైసన్ చిత్రంలోని నిజ జీవితంలో కబడ్డీ ప్లేయర్ అయిన మనతి గణేషన్ మంచి స్నేహితులు. తన తండ్రికి కబడ్డీ పట్ల ఇష్టంతో ప్రభంజన్ 2012లో కబడ్డీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, మొదట్లో జెర్సీ కొనడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ, 3వ సీజన్‌లో ‘యు ముంబా’ కబడ్డీ జట్టుకు ఎంపికై మొదటి ఆటలోనే తన ప్రతిభను చూపించాడు. ఆ తర్వాత ‘తెలుగు టైటాన్స్’ జట్టులో చేరి 4వ సీజన్‌లో ఆడిన ప్రభన్‌కు ఆ జట్టులో తగినంత అవకాశాలు రాలేదు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
ఆ తర్వాత తమిళ తలైవాస్ తరుపున ఆడారు. అలాగే గుజరాత్, బెంగాల్ జట్ల తరుపున ఆడాడు. ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్న ప్రభంజన్ కు మారి సెల్వరాజ్ ద్వారా సినిమా అవకాశం లభించింది. ఇన్నాళ్లు కబడ్డీ స్టేడియంలో తన సత్తా చాటిన ప్రభంజన్ ఇప్పుడు నటుడిగానూ మెప్పించాడు.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?




