
విభిన్న పాత్రలు చేయడానికి నటీ నటులు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి పాత్ర దొరికితే దుమ్మురేపాడనికి రెడీ అవుతుంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా.? హీరోలు చాలా మంది లేడీ గెటప్స్ లో నటించడానికి సిద్ధంగా ఉంటారు. ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడనికి చిన్న హీరోలే కాదు స్టార్ హీరోలు కూడా రెడీ అంటుంటారు. ఇటీవలే పుష్ప 2 సినిమాలో జాతర సన్నివేశాల్లో చీరకట్టుకొని అదరగొట్టారు. కాగా పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? రీసెంట్ డేస్ లో ఆయన చాలా పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆ నటుడు. కామెడీ పాత్రలే కాదు ఇలా ఛాలెంజింగ్ రోల్స్ లోనూ నటించి మెప్పించారు ఆయన ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.?
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు మరాఠి నటుడు ఉపేంద్ర. ఈ సినిమాలో ఆయన కనిపించేది కొంతసేపు అయినా ఆయన తన కామెడితో పేక్షకులను ఆకట్టుకున్నాడు ఉపేంద్ర లిమాయే. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు ఉపేంద్ర లిమాయే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నారు.
నటుడు ఉపేంద్ర మరాఠిలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. మరాఠీలో ఆయన నటించిన జోగ్వా అనే సినిమాలోని ఫోటో అది. 2009లో విడుదలైన జోగ్వా సినిమాలో ఉపేంద్ర అద్భుతంగా నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే తాయప్పా అనే పాత్రలో నటించారు, మరియు ఈ పాత్రలో అతను చీర కట్టిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం దేవదాసీ సంప్రదాయం ఆధారంగా రూపొందింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.