Mahesh Babu: అందరి దారి ఒకటి అయితే.. నా దారి రహదారి అంటున్న మహేష్
ప్రజెంట్ టాప్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు. ఎట్ లీస్ట్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటన్న విషయంలో క్లారిటీ అయినా ఇస్తున్నారు. కానీ ఒక్క మహేష్ ఈ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సూపర్ స్టార్, నెక్ట్స్ ఏంటన్నది రివీల్ చేయటం లేదు.
Updated on: May 27, 2025 | 7:20 PM

ప్రజెంట్ స్టార్ హీరోలందరూ రెండు మూడు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. సెట్స్ మీద ఉన్న సినిమా తరువాత ఏం చేస్తారన్న విషయంలో ఫుల్ క్లారిటీ ఉన్నారు.

పెద్ది వర్క్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్, నెక్ట్స్ సుకుమార్ సినిమా చేస్తానని ఎనౌన్స్ చేశారు. డ్రాగన్ షూట్‌లో ఉన్న తారక్, తరువాత దేవర 2 షూటింగ్‌లో పాల్గొంటారు.

ఇంకా అట్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్లక పోయినా... నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. ఏఏ 22 ప్లేస్‌లో చేయాల్సిన త్రివిక్రమ్ సినిమానే బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది.

ఇక డార్లింగ్ ప్రభాస్ విషయంలో అయితే వరుస సినిమాలు లైన్‌లో ఉన్నాయి.కానీ మహేష్ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఆ తరువాత ఎవరితో సినిమా చేస్తారన్నది అర్ధం కావటం లేదు.

మహేష్ కూడా ఈ విషయంలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వటం లేదు. ఎస్ఎస్ఎంబీ 29 గ్లోబల్ మూవీ కావటంతో ఈ సినిమా పూర్తయిన తరువాతే నెక్ట్స్ మూవీ గురించి ఆలోచలనుకుంటున్నారట సూపర్ స్టార్.




