- Telugu News Photo Gallery Cinema photos Will sreeleela priyanka mohan nidhi agarwal get the with pawan kalyan upcoming movies
వరుస ఫ్లాపులు.. కట్ చేస్తే పవన్ తో సినిమా పవన్ తో సినిమా.. ఎవరా బ్యూటీస్
పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో క్లారిటీ రావటంతో అభిమానులు, ఇండస్ట్రీ జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బ్యూటీస్, అప్ కమింగ్ సినిమాలతో తమ ఫేట్ మారుతుందన్న ఆశతో ఉన్నారు. అలా వెయిటింగ్‌లో ఉన్న బ్యూటీస్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: May 27, 2025 | 7:01 PM

పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ పీరియాడిక్ రోల్‌లో నటిస్తున్న మూవీ హరి హర వీరమల్లు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్‌గా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీలోనూ కొత్త జోష్ నింపారు. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్‌తో హీరోయిన్ నిథి అగర్వాల్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.

చాలా రోజులుగా బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ పవన్ మూవీతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఓజీ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ రావటంతో ప్రియాంక అరుళ్ మోహన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

చాలా రోజులుగా టాలీవుడ్‌లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియాంక, ఓజీతో తను అనుకున్న బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నారు. ఉస్తాద్ షూటింగ్ అప్‌డేట్ రావటంతో శ్రీలీల కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.

మహేష్ మూవీ తరువాత టాప్ లీగ్‌ను టార్గెట్ చేసిన ఈ బ్యూటీ పవన్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తరువాత శ్రీలీల కూడా నెంబర్ వన్ రేసులో ఫ్లాష్ అవ్వటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.




