ఈ అమ్మడు ఓ స్టార్ హీరో కూతురు.. ఎవరో గుర్తుపట్టారా..?
చాలా మంది సెలబ్రెటీల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అలా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫొటోల్లో పైన కనిపిస్తున్న అమ్మడి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరో కూతురు. హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఆమె ఎవరో.? ఆ హీరో ఎవరో కనిపెట్టారా.?

కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా మంది టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. అలా వచ్చిన వారిలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో విజయ్ దునియా సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు దునియా విజయ్. ఇక టాలీవుడ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటించారు. నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమా భారీ విజయంతో పాటు భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో దునియా విజయ్ తన నటనతో మెప్పించారు. ఇప్పుడు కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దునియా విజయ్. 2004లో రంగా అనే సినిమాతో పరిచయం అయ్యాడు విజయ్.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. 2007లో వచ్చిన దునియా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు విజయ్.
దునియా విజయ్ కు ఇద్దరు కూతుర్లు.. మోనికా, మోనిషా ఇద్దరు కూతుర్లు. ఈ ఇద్దరు త్వరలోనే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. పై ఫొటోలో ఉన్న అమ్మడు దునియా విజయ్ కూతురు. ఆమె పేరు మోనిషా.. దునియా విజయ్ కూతుర్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిన్న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ ఇద్దరు భామలు.
View this post on Instagram
మోనిషా ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మోనిషా ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
