ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టరా..? అవకాశాలు లేక ఇలా వాచ్‌మెన్‌గా..
కొంతమంది అయితే స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వారు కూడా ఇప్పుడు పూట గడవడానికి కష్టపడుతున్నారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చాలా మంది ఇప్పుడు తినడానికి తిండిలేక అల్లాడిపోతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వారు కూడా ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం.. ఇక్కడ టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది స్టార్స్ గా రాణిస్తుంటే చాలా మంది అవకాశాలు లేక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. కొంతమంది అయితే స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వారు కూడా ఇప్పుడు పూట గడవడానికి కష్టపడుతున్నారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చాలా మంది ఇప్పుడు తినడానికి తిండిలేక అల్లాడిపోతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వారు కూడా ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి ఇతర పనులు చేసుకుంటున్నారు. ఇదిగో పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు కూడా లానే ఒకప్పుడు సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు ఈయన.
పై ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు సవి సిద్ధు. ఆయన బాలీవుడ్ నటుడు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించాడు. చేసింది చిన్న పాత్రలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సవి సిద్ధు అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు.
ఇప్పుడు సవి సిద్ధు వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. తన ఇంటివాళ్లు అందరు మరణించడంతో ఒక్కడినైపోయాను అని అన్నారు. 2019వ సంవత్సరంలో ఆయన వాచ్ మెన్ గా కనిపించారు. ముంబై లో ఓ బిల్డింగ్ ముందు ఇలా వాచ్ మెన్ గా దర్శనమిచ్చాడు. ఆయన ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కావాల్సిన వారందరూ మరణించడంతో ఒంటరిని అయిపోయానని.. ఆ బాధనుంచి బయటకు రావడానికి చాలా కాలం పట్టిందని తెలిపాడు. అదే సమయంలో అవకాశాలు కూడా రాలేదని .. కనీసం బస్సు టికెట్ కొనుక్కునే డబ్బులు కూడా లేకపోవడంతో వాచ్ మెన్ గా జాయిన్ అయ్యానని తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన బాలీవుడ్ ప్రముఖులు అతడికి తిరిగి సినిమాల్లో ఛాన్స్ లు వచ్చేలా చేశారు. 2020లో సినిమాలో నటించాడు. ఆతర్వాత అతని గురించి పెద్దగా బయటకు రాలేదు.