AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓర్నీ.. ఆ గడుసుపిల్ల ఇంత అందంగా మారిందా.. ? హీరోయిన్లు సైతం దిగదుడుపే..

ఒక్క సినిమాతోనే విశ్వరూపం చూపించింది ఆ చిన్నారి. రేయ్.. కొట్టరా.. కొట్టరా.. కొట్టి చూడు.. కొడతానంటున్నాడమ్మా.. అంటూ కానిస్టేబుల్ ను అదరగొట్టేసింది. ఆ చిన్నారి మీకు గుర్తుందా.. అదేనండి లేడీ సూపర్ స్టార్ నయనతార కూతురిగా కనిపించి అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మనస్వి కొట్టాచి.

Tollywood: ఓర్నీ.. ఆ గడుసుపిల్ల ఇంత అందంగా మారిందా.. ? హీరోయిన్లు సైతం దిగదుడుపే..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2024 | 6:49 PM

Share

“రేయ్.. కొట్టరా.. కొట్టరా.. కొట్టి చూడు.. కొడతానంటున్నాడమ్మా.. లాస్ట్ వార్నింగ్.. పిచ్చిగా వాగావో” అంటూ కానిస్టేబుల్‏ను వణికించింది ఓ చిన్నారి. చైల్డ్ ఆర్టిస్టుగానే అద్భుతమైన నటనతో రఫ్పాడించిన చిన్నారి గుర్తుందా… ? ఇప్పటికీ ఆ పాపకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అంజలి CBI. 2019లో తెలుగులో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై సీజే జయకుమార్, సిహెచ్ రాంబాబు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాల్లో నయనతార, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, అథర్వ మురళీ కీలకపాత్రలు పోషించారు. ఇందులో నయనతార కూతురిగా నటించి మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ మనస్వి కొట్టాచి. ఒక్క సినిమాతోనే అటు తమిళంలో.. ఇటు తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ మనస్వి కొట్టాచి.. తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. కోలీవుడ్ కమెడియన్ కొట్టాచి కూతురు. 2018లో తమిళంలో ఇమైకా నోడిగల్ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నయనతార నటించిన అంజలి CBI చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతో చాలా క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నారి తమిళంతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ మూవీలోనూ మెరిసింది.

మనస్వి ఇదివరకు సొంతంగా కియా సోనెట్ SUVని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ చిన్నారి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా మనస్వి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. నయన్ కూతురిగా ఆ గడుసు పిల్ల ఇంత అందంగా మారిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?