Heera Rajagopal: నాగార్జున జోడిగా నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేలా మారిపోయిందో చూశారా ?..
ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలో నటించిన నాగార్జున నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో టబు కథానాయికగా కనిపించగా.. హీరా రాజగోపాల్ సైతం నటించారు. ఇందులో నాగార్జున రెండో భార్య ఝాన్సీ పాత్రలో కనిపించింది హీరా. సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చెన్నైకి చెందిన హీరా పబ్లిక్ రౌడీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దొంగల రాజ్యం,

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో హీరా రాజ్ గోపాల్ ఒకరు. అక్కినేని నాగార్జున నటించిన ఆవిడే మా ఆవిడ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి మెప్పించింది. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలో నటించిన నాగార్జున నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులో టబు కథానాయికగా కనిపించగా.. హీరా రాజగోపాల్ సైతం నటించారు. ఇందులో నాగార్జున రెండో భార్య ఝాన్సీ పాత్రలో కనిపించింది హీరా. సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చెన్నైకి చెందిన హీరా పబ్లిక్ రౌడీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత దొంగల రాజ్యం, లిటిల్ సోల్జర్స్, శ్రీకారం, ఆహ్వానం, చెలికాడు, అంతపురం, పెద్ద మనషులు, అల్లుడుగారోచ్చారు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దొంగ దొంగ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
హీరా చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చివరిగా 1999లో స్వయంవరం చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. 2002లో పుష్కర్ మాధవ్‌ను పెళ్లాడిన హీరా 2006లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఒంటరిగా జీవిస్తుంది.

Heera Rajgopal New
అయితే సినిమాలకు దూరంగా ఉంటున్న హీరా.. అటు సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. అప్పట్లో ఆమె కోలీవుడ్ హీరో అజిత్ తో ప్రేమలో పడిందని రూమర్స్ వచ్చాయి. కానీ పెళ్లిదాక వెళ్లలేదని.. దీంతో అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హీరాకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.