AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daddy Movie: దొరికేసిందిరోయ్.. డాడీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తుందంటే..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టు‏గా నటించి ఇప్పుడు హీరోహీరోయిన్లుగా కొనసాగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. మరికొందరు మాత్రం ఎన్నో హిట్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తమకు నచ్చిన రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చైల్డ్ ఆర్టిస్టు సినిమాలకు దూరంగా ఉంటూ గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసింది.

Daddy Movie: దొరికేసిందిరోయ్.. డాడీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తుందంటే..
Dady Movie
Rajitha Chanti
|

Updated on: May 04, 2025 | 8:01 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ డాడీ. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామాలో చిరు జోడిగా సిమ్రాన్ కనిపించింది. అప్పటివరకు మాస్ హీరోగా కనిపించిన చిరు.. ఈ మూవీలో మాత్రం తండ్రి పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? అప్పట్లో ఆమె నీలి కళ్లు, చూడచక్కని రూపం.. అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చందమామ లాంటి అందం, నవ్వితో బుగ్గ మీద పడే చొట్టతో.. ముద్దు ముద్దు మాటలతో వెండితెరపై సందడి చేసింది. అప్పట్లో చిరంజీవి, ఈ చిన్నారి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అమ్మాయి పేరు అనుష్క మల్హోత్రా. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆమె వయసు కేవలం ఐదేళ్లు మాత్రమే. ఈ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు.

ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క… డాడీ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. కానీ హిందీలో కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తుంది. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె లండన్ లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తుంది. డాడీ సినిమా తర్వాత అనుష్కకు హిందీలో అనేక ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడే చదువు కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయింది అనుష్క. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనుష్క. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.

అయితే ఈ అమ్మడుకు హీరోయిన్ ఛాన్సులు కూడా వచ్చినట్లు సమాచారం. కానీ సినిమాల్లోకి రావడానికి ఈ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపించలేదని.. దీంతో అవకాశాలను సున్నితంగా తిరస్కరించిందట. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్