Tollywood : ఏంటీ.. ఈ లైఫ్ బాయ్ సబ్బు యాడ్ పాప ఆ హీరోయినా.. ? అస్సలు గుర్తుపట్టలేదుగా..

చైల్డ్ ఆర్టిస్టులుగా సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు నటీనటులుగా వెండితెరపై సందడి చేస్తున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో బాలనటీనటులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందులో లైఫ్ బాయ్ యాడ్ పాప ఒకరు. ఇప్పుడు మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Tollywood : ఏంటీ.. ఈ లైఫ్ బాయ్ సబ్బు యాడ్ పాప ఆ హీరోయినా.. ? అస్సలు గుర్తుపట్టలేదుగా..
Actress

Updated on: Apr 19, 2025 | 3:29 PM

ఒకప్పుడు లైఫ్ బాయ్ సబ్బు యాడ్ లో నటించింది. ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ ? అంటూ బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు ఈ యాడ్ చాలా పాపులర్. అలాగే ఇందులో కనిపించిన ఈ అమ్మాయి సైతం మరింత ఫేమస్ అయ్యింది. ఒక్కయాడ్ తోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇంతకీ ఈ లైఫ్ బాయ్ యాడ్ పాప ఇప్పుడేలా మారింది.. ? ఏం చేస్తుందో తెలుసా..? ఆమె పేరు అవనీత్ కౌర్. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందంతో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో టీవీ సీరియల్స్, యాడ్స్ చేసింది.

ఈ అమ్మడు నటించిన లైఫ్ భాయ్, మ్యాగీ, హిందుస్తాన్ లివర్ వంటి 40కి పైగా టాప్ బ్రాండ్ యాడ్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 2014లో రాణి ముఖర్జీ నటించిన ‘మర్దానీ’ చిత్రంతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. ‘బబ్బర్ కా థాపర్’, ‘పాండిష్ పండిట్స్’ వంటి వెబ్ సిరీస్‌లలో ఆమె నటనకు చాలా ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ‘దిక్కు వెట్స్ షేరు’ ‘లవ్ కి అరేంజ్డ్ మ్యారేజ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే.

ఇవి కూడా చదవండి

కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఇన్ స్టాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరలవుతున్నాయి. చిన్నప్పుడు ముద్దుగా, క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తోంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఆఫర్స్ అందుకుంటున్న ఈ అమ్మడు సినీ ప్రయాణం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..